AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఈ హ్యాండ్సమ్ కుర్రాడిని గుర్తు పట్టారా? టీమిండియా ‘ధనాధాన్’ క్రికెటర్.. ప్రపంచకప్‌లో కీ ప్లేయర్

పై ఫొటోలో ఎంతో హ్యాండ్సమ్ గా కనిపిస్తోన్నఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్ మ్యాచ్ లను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారు పోలికలు చూసి గుర్తు పట్టవచ్చు. కానీ సాధారణ జనాలకు ఈ కుర్రాడెవరో గుర్తు పట్టడం కొంచెం కష్టమే. ఈ కుర్రాడు ఇప్పుడు టీమిండియా యంగ్ సెన్సేషన్. ఫార్మాట్ ఏదైనా బౌండరీలు, సిక్సర్లతో చెలరేగడమే ఇతని స్టైల్.

Team India: ఈ హ్యాండ్సమ్ కుర్రాడిని గుర్తు పట్టారా? టీమిండియా 'ధనాధాన్' క్రికెటర్.. ప్రపంచకప్‌లో కీ ప్లేయర్
Team India
Basha Shek
|

Updated on: Jun 09, 2024 | 5:02 PM

Share

పై ఫొటోలో ఎంతో హ్యాండ్సమ్ గా కనిపిస్తోన్నఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్ మ్యాచ్ లను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారు పోలికలు చూసి గుర్తు పట్టవచ్చు. కానీ సాధారణ జనాలకు ఈ కుర్రాడెవరో గుర్తు పట్టడం కొంచెం కష్టమే. ఈ కుర్రాడు ఇప్పుడు టీమిండియా యంగ్ సెన్సేషన్. ఫార్మాట్ ఏదైనా బౌండరీలు, సిక్సర్లతో చెలరేగడమే ఇతని స్టైల్. ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడడంలో దిట్ట. అలాగనీ ఎడాపెడా షాట్లు ఆడే రకం కాదు. పూర్తి టెక్నిక్ తో సందర్భాన్ని బట్టి చెలరేగిపోతుంటాడు. అందుకే 22 ఏళ్లకే జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. తన దైన ఆటతీరుతో టీమిండియాలో కీలక ప్లేయర్ గా ఎదిగాడు. చాలామందికీ సాధ్యం కానీ టీ20 ప్రపంచకప్ లో చోటు సంపాదించాడు. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కావడం ఇతని అదృష్టం. ఓపెనింగ్‌లో ధనాధాన్ ఇన్నింగ్స్ లు ఆడేందుకు సిద్ధమైన ఈ ప్లేయర్ ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్..ఈ అబ్బాయి మరెవరో కాదు టీమిండియా నయా సెన్సేషన్ యశస్వి జైస్వాల్.

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని నిరు పేద కుటుంబం నుంచి వచ్చాడు యశస్వి జైస్వాల్. ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న దుకాణదారుడి కుమారుడైన జైస్వాల్ తన 10 ఏళ్ల వయస్సులో క్రికెటర్‌ కావాలనే కలతో ముంబైకి వెళ్లాడు. అక్కడ ఉండటానికి చోటు లేక కొంతకాలం, అతను పని చేసే డెయిరీలో పడుకున్నాడు. పొట్ట కూటి కోసం పానీపూరీ కూడా అమ్మాడు. శాంతాక్రూజ్‌లో క్రికెట్ అకాడమీని నడుపుతున్న జ్వాలా సింగ్, యశస్వి సామర్థ్యాన్ని గుర్తించి ప్రోత్సహించారు. అప్పటివరకు తన మేనమామ టెంట్ లోనే నివాసముండేవాడు జైస్వాల్. ఆ తర్వాత అండర్-19, ఐపీఎల్, చివరకు 22 ఏళ్లకే జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ప్రస్తుతం అమెరికా, కరేబియన్ దీవుల్లో జరుగుతోన్నటీ20 ప్రపంచకప్ లో యశస్వినే కీ ప్లేయర్. ఇతను మరిన్ని ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడి భారత్ కు ప్రపంచకప్ అందించాలని కోరుకుందాం.

ఇవి కూడా చదవండి

ప్రాక్టీస్ లో యశస్వి జైస్వాల్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..