IND vs PAK: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మరోసారి భారత్, పాక్ పోరు.. ఛాంపియన్స్ ట్రోఫీ తేదీలు ఇవే..
Champions Trophy 2025 Schedule: అయితే, అన్ని ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరుగుతాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. గత కొన్నేళ్లుగా భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఆసియాకప్ టోర్నమెంట్‌కు కూడా టీం ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లకపోవడంతో ఆ తర్వాత శ్రీలంకలో భారత్ మ్యాచ్‌లు నిర్వహించారు.
Champions Trophy 2025 Schedule: టీ20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్‌లు ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్‌లో జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరో ముఖ్యమైన ఐసీసీ టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ తేదీలు కూడా వెల్లడయ్యాయి. Cricbuzz నివేదిక ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం షెడ్యూల్ గురించి ఇంకా స్పష్టమైన సమాచారం రాలేదు. కానీ, నివేదికల ప్రకారం, విండోను ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఉంచారు. ఈ 20 రోజుల్లో టోర్నీ నిర్వహించనున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రాథమిక షెడ్యూల్ అన్ని సభ్య బోర్డులతో భాగస్వామ్యం చేశారు. తద్వారా వారు తమ లీగ్‌లను తదనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు. జనవరి 11 నుంచి ఫిబ్రవరి 9 వరకు తమ టోర్నీ నిర్వహించనున్నట్లు ఇంటర్నేషనల్ లీగ్ టీ20 తెలిపింది. అదే విండోలో, దక్షిణాఫ్రికా టీ20 లీగ్ కూడా జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్తుందా?
అయితే, అన్ని ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరుగుతాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. గత కొన్నేళ్లుగా భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఆసియాకప్ టోర్నమెంట్‌కు కూడా టీం ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లకపోవడంతో ఆ తర్వాత శ్రీలంకలో భారత్ మ్యాచ్‌లు నిర్వహించారు.
భారత్ చివరిసారిగా 2008లో ఆసియా కప్ ఆడినప్పుడు పాకిస్థాన్‌లో పర్యటించింది. అప్పటి నుంచి, ఐసీసీ ఈవెంట్‌ల కోసం పాకిస్తాన్ జట్టు మూడుసార్లు భారత్‌కు వచ్చింది. అయితే, ఇప్పుడు మొదటిసారిగా ఒక ప్రధాన ఐసీసీ ఈవెంట్‌ను పాకిస్తాన్‌లో నిర్వహించనున్నారు . ఈసారి BCCI స్టాండ్ ఏమిటో చూడాలి. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాతే భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లగలదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు పాకిస్థాన్‌కు రావాలని భారత్ నుంచి హామీ ఇవ్వాలని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ కోరినట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..