Duck on ODI Debut: తొలి మ్యాచ్‌లో జీరోకే ఔట్.. లిస్టులో ఐదుగురు టీమిండియా దిగ్గజ ప్లేయర్లు..
Duck on ODI Debut: వన్డే కెరీర్‌లో మొదటి మ్యాచ్‌లో సున్నాకి ఔట్ అయిన ఐదుగురు దిగ్గజ బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. వన్డే క్రికెట్‌లో ఈ ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ల ఆరంభం చాలా భయంకరంగా ఉన్నప్పటికీ, తరువాత వారు స్టార్ క్రికెటర్లుగా పేరు తెచ్చుకున్నారు.

Duck on ODI Debut: వన్డే కెరీర్‌లో మొదటి మ్యాచ్‌లో సున్నాకి ఔట్ అయిన ఐదుగురు దిగ్గజ బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. వన్డే క్రికెట్‌లో ఈ ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ల ఆరంభం చాలా భయంకరంగా ఉన్నప్పటికీ, తరువాత వారు స్టార్ క్రికెటర్లుగా పేరు తెచ్చుకున్నారు. ఈ ఐదుగురు గొప్ప బ్యాట్స్‌మెన్లు తమ వన్డే అరంగేట్రంలో సున్నాకి ఔట్ అయినప్పటికీ, తర్వాత వారు బౌలర్లకు శాపంగా మారారు. అలాంటి ఐదుగురు గొప్ప బ్యాట్స్‌మెన్‌లను ఓసారి చూద్దాం..
1. సచిన్ టెండూల్కర్..
సచిన్ టెండూల్కర్ తన ODI అరంగేట్రం 18 డిసెంబర్ 1989న గుజ్రాన్‌వాలాలో పాకిస్తాన్‌పై ఆడాడు. సచిన్ టెండూల్కర్ తన వన్డే కెరీర్‌లో తొలి మ్యాచ్‌లోనే జీరోకే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ నంబర్-5 వద్ద బ్యాటింగ్‌కు వచ్చాడు. సచిన్ తన ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. సచిన్ టెండూల్కర్ తన వన్డే అరంగేట్రంలో సున్నాతో ఔటైనా.. తర్వాత బౌలర్లకు ముప్పుగా మారాడు. వన్డే ఇంటర్నేషనల్‌లో అత్యధికంగా 18426 పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించాడు.
2. మహేంద్ర సింగ్ ధోని..
మహేంద్ర సింగ్ ధోని 23 డిసెంబర్ 2004న చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో అరంగేట్రం చేశాడు. మహేంద్ర సింగ్ ధోని తన వన్డే కెరీర్‌లో తొలి మ్యాచ్‌లోనే సున్నాతో ఔటయ్యాడు. మహేంద్ర సింగ్ ధోని వన్డే అరంగేట్రం మ్యాచ్‌లో రనౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ 4వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మహేంద్ర సింగ్ ధోనీ 350 వన్డే మ్యాచ్‌లు ఆడి 10773 పరుగులు చేశాడు.
3. సురేష్ రైనా..
సురేశ్ రైనా తన ODI అరంగేట్రం 30 జులై 2005న శ్రీలంకతో ఆడాడు. సురేశ్ రైనా తన వన్డే కెరీర్‌లో తొలి మ్యాచ్‌లోనే సున్నాతో అవుటయ్యాడు. శ్రీలంక గ్రేట్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ చేతిలో సురేష్ రైనా ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. భారత్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సురేశ్ రైనా వన్డే అరంగేట్రంలోనే సున్నాతో ఔటైనా.. తర్వాత బౌలర్లకు ముప్పుగా మారాడు. సురేశ్ రైనా 226 వన్డేల్లో 5615 పరుగులు చేశాడు.
4. శిఖర్ ధావన్..
శిఖర్ ధావన్ తన ODI అరంగేట్రం 20 అక్టోబర్ 2010న విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. శిఖర్ ధావన్ తన వన్డే కెరీర్‌లో తొలి మ్యాచ్‌లోనే సున్నాతో ఔటయ్యాడు. శిఖర్ ధావన్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ క్లింట్ మెకే చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శిఖర్ ధావన్ 167 వన్డేల్లో 6793 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ వన్డే క్రికెట్‌లో 17 సెంచరీలు చేశాడు.
5. కృష్ణమాచారి శ్రీకాంత్..
భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ 25 నవంబర్ 1981న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. కృష్ణమాచారి శ్రీకాంత్ తన వన్డే కెరీర్‌లో తొలి మ్యాచ్‌లోనే సున్నాతో ఔటయ్యాడు. కృష్ణమాచారి శ్రీకాంత్‌ను గ్రేట్ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ అవుట్ చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కృష్ణమాచారి శ్రీకాంత్ 146 వన్డేల్లో 4091 పరుగులు చేశాడు. కృష్ణమాచారి శ్రీకాంత్ వన్డే క్రికెట్‌లో 4 సెంచరీలు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




