IND vs BAN: అశ్విన్ నుంచి పంత్ వరకు.. చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు నమోదైన 5 భారీ రికార్డులు..

5 Big Records Chennai Test Match First Day: చెన్నైలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. తొలిరోజు ఆటలో చాలా ఉత్కంఠ సాగింది. తొలి రెండు సెషన్లలో బంగ్లాదేశ్ జట్టు ఆధిపత్యం చెలాయించగా, చివరి సెషన్‌లో టీమిండియా విజిటింగ్ జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రవిచంద్రన్ అశ్విన్ అద్భుత సెంచరీ సాధించి భారత్‌ను 300 దాటించాడు.

IND vs BAN: అశ్విన్ నుంచి పంత్ వరకు.. చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు నమోదైన 5 భారీ రికార్డులు..
Ind Vs Ban 1st Test Records
Follow us
Venkata Chari

|

Updated on: Sep 19, 2024 | 7:37 PM

5 Big Records Chennai Test Match First Day: చెన్నైలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. తొలిరోజు ఆటలో చాలా ఉత్కంఠ సాగింది. తొలి రెండు సెషన్లలో బంగ్లాదేశ్ జట్టు ఆధిపత్యం చెలాయించగా, చివరి సెషన్‌లో టీమిండియా విజిటింగ్ జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రవిచంద్రన్ అశ్విన్ అద్భుత సెంచరీ సాధించి భారత్‌ను 300 దాటించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 339 పరుగులు చేసింది.

ఒకానొక సమయంలో భారత క్రికెట్ జట్టు 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే, ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఆరో వికెట్‌కు అజేయ భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను 300 దాటికి తీసుకెళ్లారు. ఇద్దరు ఆటగాళ్లు తమ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఎన్నో పెద్ద రికార్డులు సృష్టించారు. భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య చెన్నై టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు 5 పెద్ద రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

IND vs BAN చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు నమోదైన రికార్డులు..

5. రిషబ్ పంత్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 4000 పరుగులు పూర్తి చేశాడు. ఇప్పుడు ఎంఎస్ ధోని తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో 4 వేలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

4. రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్‌లో తన కెరీర్‌లో రెండో వేగవంతమైన అర్ధ సెంచరీని సాధించాడు. కేవలం 58 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌కి ఇది రెండో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ. అంతకుముందు 2012లో టెస్టుల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు సృష్టించాడు.

3. రవిచంద్రన్ అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించాడు. అశ్విన్ 108 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అతనికిది ఆరో సెంచరీ.

2. రవిచంద్రన్‌ అశ్విన్‌, జడేజా ఏడో వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఏడో లేదా అంతకంటే తక్కువ స్థాయిలో బంగ్లాదేశ్‌పై ఏ వికెట్‌కైనా ఇప్పటివరకు భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. అంతకుముందు 2004లో జహీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్ 10వ వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

1. ప్రపంచంలో 500కి పైగా టెస్టు వికెట్లు తీసి 6 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు అశ్విన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..