- Telugu News Photo Gallery Cricket photos IND vs BAN 1st Test Team India Player Rishabh Pant Completes 4000 Runs in International Cricket 2nd Indian Wicket Keeper After MS Dhoni
IND vs BAN: 632 రోజుల తర్వాత వచ్చాడు.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో బంగ్లా దూల తీర్చాడు.. కట్‌చేస్తే.. స్పెషల్ రికార్డ్‌లో చోటు
Rishabh Pant Big Record In Test Cricket: భారత్-బంగ్లాదేశ్ మధ్య చెన్నైలో తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ సమయంలో భారత జట్టు బ్యాటింగ్‌లో తొలుత తడబడింది. భారత్ 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా, 144 పరుగులకే ఆ జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరుకున్నారు.
Updated on: Sep 19, 2024 | 7:47 PM

Rishabh Pant Big Record In Test Cricket: భారత్-బంగ్లాదేశ్ మధ్య చెన్నైలో తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ సమయంలో భారత జట్టు బ్యాటింగ్‌లో తొలుత తడబడింది. భారత్ 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా, 144 పరుగులకే ఆ జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరుకున్నారు.

ఈ సమయంలో, టాప్ ఆర్డర్‌లో యశస్వి జైస్వాల్, మిడిల్ ఆర్డర్‌లో రిషబ్ పంత్ మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్‌లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఇన్నింగ్స్‌ను చేజిక్కించుకున్నారు. రిషబ్ పంత్ తన తుఫాన్ ఇన్నింగ్స్‌లో భారీ రికార్డును కూడా నమోదు చేశాడు.

ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్ పంత్ తనదైన శైలిలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేశాడు. రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ మధ్య నాలుగో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ సమయంలో రిషబ్ పంత్ 52 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అవుట్ అయ్యే ముందు, అతను పవర్ ఫుల్ ఫాట్లతో అలరించాడు. అయితే, ఓ పవర్ ఫుల్ ఫోర్ కొట్టిన తర్వాత.. అదే రకమైన షాట్ ఆడే ప్రయత్నంలో వికెట్ల వెనుక చిక్కి పెవిలియన్ చేరాడు.

రిషబ్ పంత్ తన అద్భుతమైన బ్యాటింగ్‌లో కూడా అద్భుతమైన రికార్డును నమోదు చేశాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో 4 వేలకుపైగా పరుగులు సాధించాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 4 వేలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. ఈ విషయంలో, అంతర్జాతీయ క్రికెట్‌లో 17 వేలకు పైగా పరుగులు చేసిన ఎంఎస్ ధోని నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సయ్యద్ కిర్మాణి 3132 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

రిషబ్ పంత్ చాలా కాలం తర్వాత టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. ప్రమాదం తర్వాత, అతను మొదటిసారిగా టెస్ట్ క్రికెట్ ఆడటానికి వచ్చాడు. ఈ సమయంలో అతని పాత శైలి కనిపించింది. భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పటికీ రిషబ్ పంత్ తన సహజ శైలిలో బ్యాటింగ్ చేశాడు.




