IND vs ENG: ఇంగ్లండ్‌కు భారీ షాక్.. మ్యాచ్ మధ్యలోనే రోహిత్ సేనకు గుడ్‌న్యూస్ చెప్పిన బెన్ స్టోక్స్ టీం..
India vs England, 1st Test Day 4: ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 246 పరుగులు చేసింది. కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులు చేసింది. భారత్ భారీ ఆధిక్యం సాధించింది. కానీ, టీమ్ ఇండియా బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను అడ్డుకోవడంలో విఫలవ్వడంతో టార్గెట్ 230 పరుగులకు చేరింది.

India vs England, 1st Test Day 4: హైదరాబాద్ టెస్టులో టీమిండియాకు గట్టి సవాల్ విసిరిన ఇంగ్లండ్ దాదాపు 420 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బౌలర్లపై పైచేయి సాధించింది. ప్రస్తుతం టీమిండియా లక్ష్యం 230 పరుగులుగా సెట్ చేఇసంది. అయితే, ఉప్పట్ స్టేడియంలో 4వ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా టార్గెట్‌ను ఎలా ఛేదిస్తుందో చూడాల్సి ఉంది. అయితే ఈ కష్టాల మధ్య టీమ్ ఇండియాకు ఊరటనిచ్చే వార్త కూడా వచ్చింది.
నిజానికి, ఇంగ్లండ్ ప్రధాన స్పిన్నర్ జాక్ లీచ్ గాయపడ్డాడు. జాక్ లీచ్ మొదటి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేశాడు. అయితే ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతని మోకాలికి గాయమైంది. ఇప్పుడు జాక్ లీచ్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం కష్టమని, అంటే రెండో ఇన్నింగ్స్‌లో అతను ఫీల్డింగ్ చేయడం కూడా కష్టమనే వార్తలు చెబుతున్నాయి.
జాక్ లీచ్ ఇప్పటికే మోకాలి సమస్యతో బాధపడుతున్నాడని, ఆ తర్వాత ఫీల్డింగ్ చేస్తున్న మ్యాచ్‌లోనే రెండుసార్లు మోకాలికి గాయమైనట్లు ఇంగ్లండ్ నుంచి సమాచారం అందింది. దీంతో మైదానంలో నిలవడం అతనికి కష్టంగా మారింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జాక్ లీచ్ బ్యాటింగ్‌కు వచ్చినా ఒక్క బాల్ కూడా ఆడకుండానే ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయింది.
జాక్ లీచ్ రికార్డు ఎలా ఉంది?
Jasprit Bumrah with the final breakthrough!
He gets Ollie Pope OUT for 196 👏👏
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/idsVGETz7e
— BCCI (@BCCI) January 28, 2024
ఇక జాక్ లీచ్ గురించి చెప్పాలంటే.. ఇంగ్లండ్ తరపున 35 మ్యాచుల్లో 124 వికెట్లు తీశాడు. గత కొంతకాలంగా టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌కు ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో అతడు లేకుండానే భారత్‌ను ఆలౌట్ చేయడానికి ఇంగ్లండ్ ప్రయత్నించాల్సి ఉంటుంది. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్ తరపున జో రూట్ మెరుగ్గా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 246 పరుగులు చేసింది. కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులు చేసింది. భారత్ భారీ ఆధిక్యం సాధించింది. కానీ, టీమ్ ఇండియా బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను అడ్డుకోవడంలో విఫలవ్వడంతో టార్గెట్ 230 పరుగులకు చేరింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




