AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: 12 ఏళ్ల తర్వాత భారత్‌పై షాకింగ్ రికార్డ్.. రెండో ఇన్నింగ్స్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్..

England Team Records: ఇంగ్లండ్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి 350 పరుగుల మార్కును దాటిన వెంటనే ఆ జట్టు పేరిట ఓ భారీ రికార్డు నమోదైంది. ఇప్పుడు గత 12 ఏళ్లలో భారత్‌పై రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ 350కి పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా నిలిచింది. అంతకు ముందు 2012లో నాగ్‌పూర్ టెస్టులో ఇంగ్లండ్ 4 వికెట్లకు 352 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆ టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. గత 12 ఏళ్లలో, స్వదేశంలో టెస్ట్ సిరీస్‌లో భారత్‌ను ఓడించిన ఘనతను సాధించిన ఏకైక జట్టుగా ఇంగ్లాండ్ జట్టు నిలిచింది.

IND vs ENG: 12 ఏళ్ల తర్వాత భారత్‌పై షాకింగ్ రికార్డ్.. రెండో ఇన్నింగ్స్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్..
Ind Vs Eng Records
Venkata Chari
|

Updated on: Jan 28, 2024 | 12:26 PM

Share

England Cricket Team: హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ (IND vs ENG) రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ తమ అద్భుతమైన బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించింది. 2012 తర్వాత భారత్‌పై రెండో ఇన్నింగ్స్‌లో విజిటింగ్ టీం 350కి పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. గతంలో 2012లో ఇంగ్లండ్ ఈ ఘనత సాధించగా.. ఇప్పుడు మరోసారి ఆ రికార్డును పునరావృతం చేసింది.

రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఓ దశలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. అయితే, ఆ తర్వాత ఓలీ పోప్, బెన్ ఫాక్స్ ఇన్నింగ్స్‌ను స్వాధీనం చేసుకుని ఆరో వికెట్‌కు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒల్లీ పోప్ అద్భుత సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. అతను ఈ మారథాన్ ఇన్నింగ్స్ ఆడకపోతే, ఇంగ్లండ్ జట్టు ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేయలేకపోయేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో చాలా తేలికగా ఓడిపోయేది.

2012 నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్‌లో..

ఇంగ్లండ్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి 350 పరుగుల మార్కును దాటిన వెంటనే ఆ జట్టు పేరిట ఓ భారీ రికార్డు నమోదైంది. ఇప్పుడు గత 12 ఏళ్లలో భారత్‌పై రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ 350కి పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా నిలిచింది. అంతకు ముందు 2012లో నాగ్‌పూర్ టెస్టులో ఇంగ్లండ్ 4 వికెట్లకు 352 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆ టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. గత 12 ఏళ్లలో, స్వదేశంలో టెస్ట్ సిరీస్‌లో భారత్‌ను ఓడించిన ఘనతను సాధించిన ఏకైక జట్టుగా ఇంగ్లాండ్ జట్టు నిలిచింది.

ఇప్పుడు ఈ రికార్డుతో ఇంగ్లండ్ కూడా తమ స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టును మరోసారి ఓడించి పెద్ద రికార్డు సృష్టించాలని కన్నేసింది.

మ్యాచ్ గురించి మాట్లాడితే..

హైదరాబాద్ టెస్టులో నేడు నాలుగో రోజు. ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులు చేసింది. 196 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ఓలీ పోప్ డబుల్ సెంచరీని కోల్పోయాడు. దీంతో తొలి టెస్టులో గెలిచేందుకు భారత్‌కు 231 పరుగుల విజయ లక్ష్యం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..