Virat Kohli Records and Stats: చెపాక్‌లో కోహ్లీ సరికొత్త రికార్డ్.. తొలి భారత ప్లేయర్‌గా రన్ మెషీన్..
Virat Kohli Records and Stats in Telugu: ఐపీఎల్ 2024 మొదలైంది. శుక్రవారం తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ చెపాక్‌లో జరిగింది. తొలి మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ ఓ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL) 2024 ఓపెనర్‌లో విరాట్ కోహ్లీ 12,000 టీ20 పరుగులు చేసిన మొదటి భారతీయుడిగా నిలిచాడు.
Virat Kohli: ఐపీఎల్ 2024 మొదలైంది. శుక్రవారం తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ చెపాక్‌లో జరిగింది. తొలి మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ ఓ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL) 2024 ఓపెనర్‌లో విరాట్ కోహ్లీ 12,000 టీ20 పరుగులు చేసిన మొదటి భారతీయుడిగా నిలిచాడు.
35 ఏళ్ల విరాట్ కోహ్లీ T20 వెటరన్ ప్లేయర్స్ క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్ తర్వాత మైలురాయిని చేరుకున్న ప్రపంచంలో ఆరో ఆటగాడిగా నిలిచాడు.
కోహ్లి తన 377వ గేమ్‌లోని ఏడో ఓవర్‌లో మైలురాయిని చేరుకున్నాడు. రవీంద్ర జడేజా వేసిన ఫుల్ బాల్‌ను లెగ్ సైడ్‌లో సింగిల్ కోసం ఫ్లిక్ చేశాడు.
ఈ జాబితాలో 426 మ్యాచ్‌ల్లో 11156 పరుగులు చేసిన రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో ఉన్నాడు. శిఖర్ ధావన్ 329 మ్యాచ్‌ల్లో 9645 పరుగులు చేశాడు.
అత్యధిక T20 పరుగులు చేసిన బ్యాటర్స్..
క్రిస్ గేల్ – 14562
షోయబ్ మాలిక్ – 13360
కీరన్ పొలార్డ్ – 12900
అలెక్స్ హేల్స్ – 12319
డేవిడ్ వార్నర్ – 12065
విరాట్ కోహ్లీ – 12000*
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..