CSK vs RCB: ఆర్‌సీబీకి ప్రాణం పోసిన దినేష్ కార్తీక్, అనుజ్ రావత్‌ల ఇన్నింగ్స్.. కట్‌చేస్తే.. చెన్నై ముందు భారీ టార్గెట్..
ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చెన్నైకి 174 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఆర్సీబీ తరపున కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ 35 పరుగులు చేశాడు. అదే సమయంలో, చివరికి అనుజ్ రావత్ 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దినేష్ కార్తీక్ 38 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 21 పరుగులు చేశాడు. అంతకుముందు పాటీదార్, మ్యాక్స్‌వెల్‌లు సున్నాకే ఔటయ్యారు. చెన్నై తరపున ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్ ఒక వికెట్ తీశాడు.

CSK vs RCB, IPL 2024: IPL 2024 కోసం నిరీక్షణ ముగిసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. చెన్నైకి 174 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఆర్సీబీ తరపున కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ 35 పరుగులు చేశాడు.
అదే సమయంలో, చివరికి అనుజ్ రావత్ 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దినేష్ కార్తీక్ 38 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 21 పరుగులు చేశాడు. అంతకుముందు పాటీదార్, మ్యాక్స్‌వెల్‌లు సున్నాకే ఔటయ్యారు. చెన్నై తరపున ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్ ఒక వికెట్ తీశాడు.
Innings Break!
Anuj Rawat & Dinesh Karthik fire with the bat to power @RCBTweets to 173/6 🙌 🙌
Mustafizur Rahman stars with the ball for @ChennaiIPL 👌 👌
Stay Tuned for the #CSK chase ⌛️
Scorecard ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL | #CSKvRCB pic.twitter.com/OgVMjbwQiX
— IndianPremierLeague (@IPL) March 22, 2024
12వేల పరుగులు..
కోహ్లి 12 వేల టీ-20 పరుగులు పూర్తి చేశాడు. ఆరో పరుగు చేసిన తర్వాత మైలురాయిని సాధించాడు. విరాట్ కోహ్లీ తన టీ-20 కెరీర్‌లో 12 వేల టీ20 పరుగులు పూర్తి చేశాడు. 7వ ఓవర్‌లో రవీంద్ర జడేజా వేసిన బంతికి ఆరో పరుగు సాధించడంతో అతను ఈ ఘనత సాధించాడు.
First Indian to reach the 12000 T20 runs milestone 🫡#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #CSKvRCB #ViratKohli pic.twitter.com/Dh5rCn6nzl
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 22, 2024
ఇరు జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని(కీపర్), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (కీపర్), అనుజ్ రావత్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








