AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లోని మూలలో ఈ వస్తువులు పెడితే డబ్బులే డబ్బులు..!

Vastu Tips: వాస్తుశాస్త్రం ప్రకారం.. ఆర్థిక పురోగతి ఇంటి ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశలను పేర్కొంటారు. ఈ దిశలలో ఇంట్లో ఏదైనా వాస్తు దోషం

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లోని మూలలో ఈ వస్తువులు పెడితే డబ్బులే డబ్బులు..!
Vastu Tips
Shiva Prajapati
|

Updated on: Mar 22, 2022 | 6:16 AM

Share

Vastu Tips: వాస్తుశాస్త్రం ప్రకారం.. ఆర్థిక పురోగతి ఇంటి ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశలను పేర్కొంటారు. ఈ దిశలలో ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉంటే అనేక సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ దిక్కులలో వాస్తపరమైన తప్పిదాలు చేయకుండా ఉంటే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడమే కాకుండా.. ధనప్రాప్తి సిద్ధిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి నాలుగు దిక్కులలో కొన్ని వస్తువులు పెడితే.. జీవితంలో విజయాన్ని, ఇంట్లో ఆనందం, శ్రేయస్సును అందిస్తుందని చెబుతున్నారు. మరి ఏ దిక్కున ఏం పెడితే, ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

నీలం రంగు పిరమిడ్.. ఇంటికి ఉత్తర దిశలో నీలిరంగు పిరమిడ్‌ను ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. నీలం రంగు పిరమిడ్‌ను ఉత్తరం వైపు ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరిస్తుంది. కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి.

గాజు గిన్నె.. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఒక గాజు గిన్నె లేదా గిన్నె ఇంటికి ఉత్తర దిశలో ఉంచాలి. ఈ గిన్నెలో వెండి నాణెం కూడా ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మి దేవత ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఆర్థికంగా ఎలాంటి సమస్యలూ రాకపోగా.. సంపద లభిస్తుంది.

తులసి, ఆమ్లా మొక్కలు.. ఇంటికి ఉత్తర దిశలో తులసి మొక్కను నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంతే కాకుండా ఉసిరి చెట్టును నాటడం కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది కుటుంబం ఆర్థిక శ్రేయస్సును పెంచడంలో సహాయపడుతుంది.

గణేశుడు, లక్ష్మీ దేవి విగ్రహం.. వాస్తు ప్రకారం.. వినాయకుడు, లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలి. అంతే కాకుండా వినాయకుడు, లక్ష్మీ దేవి విగ్రహాల ముందు రోజూ నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.

ఉత్తర దిశలో డబ్బు.. వాస్తు శాస్త్రం ప్రకారం, ఉత్తర దిశకు అధిపతి అయిన కుబేరుడు సంపదకు దేవుడు అని కూడా అంటారు. అందుకని డబ్బు లేదా ఇతర విలువైన సంపద ఇంట్లో ఉత్తరం దిక్కున ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.

నీటి ట్యాంక్ దిశ.. ఇంటి ఉత్తర దిశలో నీటిని అమర్చడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీరు నీటి తొట్టిలో ఒక శంఖం, వెండి నాణెం, వెండి తాబేలు ఉంచవచ్చు. ఇది చాలా లాభిస్తుంది.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది.)

Also Read:

Health care ideas: ఇవి తిన్నా, తాగినా క్యాన్సర్ బారిన పడటం ఖాయం.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..!

Russia Ukraine War: ఇది కదా దేశ భక్తి అంటే.. క్లిష్ట సమయంలో సైనికులకు అధ్బుతమైన ప్రేరణ ఇస్తున్న ఉక్రేయిన్ ప్రజలు..

AP Weather Alert: ముంచుకొస్తున్న ‘అసాని’.. ఆ జిల్లాలపై ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం..!