Zodiac Signs: వీళ్లకు రూల్స్‌తో పన్లేదు.. ట్రెండ్ సెట్ చేయడమే వీరి హాబీ.. అందులో మీరున్నారా!
వీళ్లకు రూల్స్‌తో పన్లేదు. ఎవ్వరి మాట వినరు. పూర్తిగా రెబల్స్. మనస్సు చెప్పేదే చేస్తారు. ట్రెండ్ సెట్ చేస్తూ పోతారు...
వీళ్లకు రూల్స్‌తో పన్లేదు. ఎవ్వరి మాట వినరు. పూర్తిగా రెబల్స్. మనస్సు చెప్పేదే చేస్తారు. ట్రెండ్ సెట్ చేస్తూ పోతారు. ఇలాంటివారు చాలా అరుదు. అప్పుడప్పుడూ మీ గ్యాంగ్‌లో కూడా ఈ వ్యక్తులు తారసపడి ఉంటారు. ఈ రాశులవారు నియమాలను అస్సలు ఫాలోకారట. మరి వారెవరో.. అందులో మీరున్నారో తెలుసుకుందాం పదండి..
మిధునరాశి:
ఈ రాశివారి మాటలు, చేసే పనులు చాలా అనుహ్యమైనవి. ఎవ్వరూ ఊహించలేరు. అప్పటికప్పుడు పరిస్థితిని బట్టి.. వీరి చర్యలు ఉంటాయి. ఇతరుల అంచనాలను కచ్చితంగా రీచ్ అవుతారు. అలాగే రూల్స్ పాటించరు. ఆ సమయంలో తప్పులు చేసినా అస్సలు పట్టించుకోరు.
మీనరాశి:
ఈ రాశివారు వారి అంతర్ దృష్టిని అనుసరిస్తారు. వీరు రూల్స్‌ను పట్టించుకోరు. వీరు సంతృప్తికరంగా ఉన్నంతకాలం.. చేసిన చర్యలు.. వాటి పరిణామాల గురించి అస్సలు పట్టించుకోరు. వీరికి గొడవలు అంటే అస్సలు ఇష్టముండదు.
మేషరాశి:
ఇతరులు తమ నుంచి ఏం ఆశిస్తున్నారన్నది ఈ రాశివారు అస్సలు పట్టించుకోరు. ఎప్పుడూ ఏదొకటి కొత్తగా చేయాలని అనుకుంటారు. వారు కోరుకున్నది మాత్రమే చేస్తారు. వారి మనస్సు చెప్పిన మాటను వింటారు. తప్పు చేస్తున్నామని.. వెనకడుగు వెయ్యాలా.? అంటూ అస్సలు ఆలోచించరు. మనస్సు గ్రీన్ సిగ్నల్ ఇస్తే రెబల్‌గా ముందుకెళ్ళిపోతారు.
ధనుస్సురాశి:
ఈ రాశివారు రూల్‌బుక్‌లో లేని పనులను చేయడంలో థ్రిల్, మజాను ఆస్వాదిస్తారు. వీరు రూల్స్ ఎప్పుడూ బ్రేక్ చేస్తారు.. ఎలప్పుడూ సరదాగా ఉంటారు. ఇతరులు అనుసరించే మార్గంలో వీరు అస్సలు వెళ్లరు. ఎప్పుడూ సవాళ్లను ఎదుర్కోవడానికి ముందుంటారు.
కుంభరాశి:
ఈ రాశివారు అంతర్ముఖులు అయినప్పటికీ, విప్లవాత్మక ఆలోచనలపై ఎక్కువ విశ్వసిస్తారు. ఎవరికైనా మంచి జరుగుతుందని అనుకుంటే.. రూల్స్ బ్రేక్ చేయడంలో అస్సలు ఆలోచించరు. ఎలప్పుడూ ఇతరులకు అండగా నిలుస్తారు. వారి తరపున నిలబడతారు.