Horoscope Today: ఈ రాశివారికి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి
Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఏ పనులు..
Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతారు. మార్చి 22 (మంగళవారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
- మేష రాశి: ధైర్యంతో ముందుకెళితే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటివారి సహాయ సహకారాలు మేలు చేస్తాయి.
- వృషభ రాశి: తరచూగా నిర్ణయాలు మార్చుకోవడం కారణంగా కొంత ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
- మిథున రాశి: కుటుంబ సభ్యుల సహకారాలతో చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉంటం మంచిది. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.
- కర్కాటక రాశి: కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. కలహాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
- సింహరాశి: అనుకున్నది సాధిస్తారు. చేపట్టిన పనులలో మంచి ఫలితాలు ఉంటాయి. ఓ వ్యవహారంలో ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
- కన్య రాశి: ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తలు పాటించడం అవసరం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
- తుల రాశి: ఆత్మవిశ్వాసంలో పని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి.
- వృశ్చిక రాశి: శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అప్పుల కారణంగా ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది.
- ధనుస్సు రాశి: ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఓ శుభవార్త మిమ్మల్ని ఉత్సాహ పరుస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి.
- మకర రాశి: కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
- కుంభ రాశి: ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అవనసరమైన కలహాలు వెంటాడుతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవాలి.
- మీన రాశి: శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
Gold Silver Price Today: మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
TTD News: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు రూ. 300ల ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల..
(నోట్: రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని జ్యోతిషుల ద్వారా ఇక్కడ అందించబడింది.)