Horoscope Today: ఈ రాశివారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు
Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే..
Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతారు. మార్చి 21 (సోమవారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
- Horoscope Today: మేష రాశి: విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లాభాలు పొందుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.
- వృషభ రాశి: శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- మిథున రాశి: వివిధ పనుల నిమిత్తం పెద్దలతో చర్చిస్తారు. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన ముఖ్యమైన ఓ పని పూర్త కావస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.
- కర్కాటక రాశి: శ్రమ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కీలక వ్యవహారాలలో ముందుడుగు వేస్తారు. నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవడం మంచిది.
- సింహ రాశి: చేపట్టిన పనులను సకాంలో పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థికపరంగా లాభాలు పొందుతారు. అనుకున్నది సాధిస్తారు.
- కన్య రాశి: చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురు కాకుండా ముందు చూపుతో శ్రద్ద వహించాలి. కొన్ని విషయాలలో అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. అధికారుల నుంచి సహాయం అందుకుంటారు.
- తుల రాశి: ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి అడుగు వేయాలి. అవసరానికి తగిన సహకారం అందుకుంటారు. ఓ శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
- వృశ్చిక రాశి: ఒక ముఖ్యమైన వ్యవహారాలలో తగిన ఆర్థిక సాయం అందుతుంది. ఉద్యోగులకు మంచి జరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి.
- ధనుస్సు రాశి: ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఓ వార్త మీ కుటుంబంలో సంతోషాన్ని ఇస్తుంది. కీలక వ్యవహారాలలో చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
- మకర రాశి: గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
- కుంభ రాశి: ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి అడుగులు వేయాలి. ఆర్థిక ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి.
- మీన రాశి: పట్టుదలతో ఉత్సాహంగా ముందుకు సాగితే అనుకున్న పనులు సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రదద వహించాలి. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని జ్యోతిషుల ద్వారా ఇక్కడ అందించబడింది.)
ఇవి కూడా చదవండి: