Russia Ukraine War: ఇది కదా దేశ భక్తి అంటే.. క్లిష్ట సమయంలో సైనికులకు అధ్బుతమైన ప్రేరణ ఇస్తున్న ఉక్రేయిన్ ప్రజలు..

Russia Ukraine War: ఉక్రెయిన్, రష్యా యుద్ధం పీక్స్ స్టేజ్‌లో ఉంది. రెండు దేశాలూ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా

Russia Ukraine War: ఇది కదా దేశ భక్తి అంటే.. క్లిష్ట సమయంలో సైనికులకు అధ్బుతమైన ప్రేరణ ఇస్తున్న ఉక్రేయిన్ ప్రజలు..
Ukraine
Follow us

|

Updated on: Mar 22, 2022 | 5:30 AM

Russia Ukraine War: ఉక్రెయిన్, రష్యా యుద్ధం పీక్స్ స్టేజ్‌లో ఉంది. రెండు దేశాలూ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా ఆ దేశంలోని వివిధ నగరాలపై రష్యా దళాలు భీకర దాడులు చేస్తున్నాయి. అయితే, రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌ ప్రజల్లో మాతృదేశంపై ప్రేమ పెరిగింది. ప్రజల్లో దేశ భక్తి ఉప్పొంగుతోంది. రష్యాపై ఆక్రోశంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంపై తమకున్న ప్రేమను పచ్చబొట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు ఉక్రెయిన్ ప్రజలు. ఉక్రెయిన్ జెండా, ఇతర దేశభక్తి చిహ్నాలను ప్రజలు టాటూలు వేయించుకుంటున్నాడు. ఇప్పుడు ఉక్రెయిన్ వ్యాప్తంగా టాటూలు, బిల్‌బోర్డులు ట్రెండింగ్‌గా మారాయి.

ఉక్రెయిన్‌కు చెందిన 18 ఏళ్ల ఒలేనా బార్లెవిచ్.. ఇటీవల మిలటరీ విమానంతో కూడిన ఉక్రెయిన్ కోట్ ఆఫ్ ఆర్మ్స్ ఆటూ టాటూ వేయించుకుంది. ఇది తన దేశాన్ని రక్షించుకునేందుకు సైనికుల్లో ప్రేరణ కల్పించేందుకు, తమ దేశం పట్ల తమకున్న ప్రేమ, అభిమానానికి ఈ టాటూ చిహ్నం అని పేర్కొంది యువతి. ‘ఈ పచ్చబొట్టులో చాలా అర్థం ఉంది. ప్రస్తుతం దేశానికి కీలక సమయం. ఇది చరిత్రలో నిలిచిపోవాలి. భవిష్యత్ తరాలకు దేశభక్తి అందించబడాలి.’’ అని బార్లెవిచ్ పేర్కొంది. ఈమే కాదు.. ఉక్రెయిన్ వ్యాప్తంగా ఇప్పుడు ఈ టాటూలు, బిల్ బోర్డులు ట్రెండీగా నిలిచాయి. టాటూల కోసం ఉక్రెయిన్ వ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని, టాటూలు వేసే వారు చెబుతున్నారు. ఇక ఎల్వివ్‌లోని ప్రింట్ షాపు మేనేజర్ యూరి కోబ్రిన్ ఉక్రెయినియన్ దళాలకు మద్ధతుగా వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. దేశం కోసం ప్రేరణాత్మకమైన సందేశాలను టాటూలుగా, బిల్‌బోర్డ్ ప్రకటనలలో ఇస్తున్నారు. దేశం కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, సైన్యానికి ప్రేరణ కల్పించేందుకే ఈ ప్రయత్నం అని ఆదేశ ప్రజలు చెబుతున్నారు. నిజంగా ఉక్రెయిన్ ప్రజల దేశ భక్తికి యావత్ ప్రపంచం దాసోహం అవుతోంది.

Also read:

KVS Admissions 2022: కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే..

AIIMS Gorakhpur 2022: నెలకు రూ. 67 వేల జీతంతో ఎయిమ్స్ గోరఖ్‌పూర్‌లో సీనియర్ రెసిడెంట్ జాబ్స్..

Almond Oil: బాదం నూనెతో కళ్లకింద నల్లటి వలయాలకి చెక్.. ఈ 5 పద్దతుల్లో ప్రయత్నిస్తే కచ్చితమైన ఫలితాలు.

తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..