Russia – Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్‌లో అమెరికా ఎంటరవుతుందా? ఆ ప్రకటన దేనికి సంకేతం..!
Russia - Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్‌లో అమెరికా ఎంట్రీ ఖాయమనిపిస్తోంది. సామాన్య పౌరులను రష్యా బలగాలు..
Russia – Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్‌లో అమెరికా ఎంట్రీ ఖాయమనిపిస్తోంది. సామాన్య పౌరులను రష్యా బలగాలు టార్గెట్ చేస్తున్నాయని, ఉక్రెయిన్‌కు మద్దతుగా తాము కూడా దాడులు చేస్తామని నాటో హెచ్చరించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఐదో విడత చర్చల్లో కూడా ఎలాంటి పురోగతి కన్పించలేదు. దాంతో పరిణామాలో మారిపోతున్నాయి.
ఉక్రెయిన్ – రష్యా యుద్ధం మూడో ప్రపంచయుద్ధంగా మారే ప్రమాదాలు కన్పిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు శాంతి పరిరక్షక దళాలను పంపే ఆలోచనలో ఉంది అమెరికా. ఈనెల 25న ఉక్రెయిన్‌కు ఆనుకొని ఉన్న పోలెండ్‌కు రానున్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. పోలండ్ అధ్యక్షుడితో భేటీ తరువాత అమెరికా బలగాలను పంపే విషయంపై తుదినిర్ణయం తీసుకుంటారు.
ఉక్రెయిన్‌లో రష్యా దాడులపై నాటో కూటమి సీరియస్ అయ్యింది. సామాన్య పౌరులను కాపాడడానికి అవసరమైతే తాము కూడా మిస్సైల్స్ ప్రయోగిస్తామని నాటో హెచ్చరించింది. రష్యా దాడులను తిప్పికొట్టే సమయం ఆసన్నమయ్యిందని నాటో నేతలంటున్నారు.
ఇక ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి రష్యా బలగాలు. ఇప్పటికే కీవ్ శివారు ప్రాంతాలను రష్యా కబ్జా చేసింది. ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో రష్యా తొలిసారి కీవ్ మీద కూడా హైపర్‌సోనిక్ మిస్సైల్స్‌ను ప్రయోగించింది. రష్యా దాడిలో కీవ్ లోని షాపింగ్ కాంప్లెక్స్ కుప్పకూలింది. ఈ పేలుడులో ఆరుగురు చనిపోయారు. రష్యా దాడుల కారణంగా కీవ్‌లో మరోసారి కర్ఫ్యూ విధించారు. బుధవారం వరకు కీవ్‌లో కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
రష్యా దాడిలో మరియాపోల్ నగరం సర్వనాశనమయ్యింది, నగరంలోని 80 శాతం భవనాలు నేలమట్టమయ్యాయి. 4 లక్షల మంది సామాన్య పౌరులు సర్వం కోల్పోయారు. తిండితిప్పలు లేక వాళ్లు అలమటిస్తున్నారు. రష్యా అధునాతన ఆయుధాలను ప్రయోగించడంతో ఉక్రెయిన్ పౌరులు తల్లడిల్లిపోతున్నారు. 2,500 మంది సామాన్య పౌరులు చనిపోయారు
ఖార్కీవ్‌లో రష్యా క్షిపణి దాడి దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. జనం షాపింగ్ కాంప్లెక్‌లో ఉన్న సమయంలో భారీ పేలుడు జరిగింది. యుద్ధం కారణంగా కోటిన్నర మంది నిర్వాసితులైనట్టు ఐక్యరాజ్యసమితి తాజా నివేదకలు చెబుతున్నాయి.
ఇదిలాఉంటే.. ఉక్రెయిన్-రష్యా మధ్య ఐదో విడత చర్చలు జరిగాయి. చర్చల సందర్భంగా కాల్పుల విరమణ ఉండదని రష్యా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీవ్‌లో తాజా పరిస్థితిని వివరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడే మిస్సైల్ సైరన్లు మోగిన దృశ్యాలు పరిస్థితిని అద్దంపట్టాయి.
Also read:
Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా జీతాలు పెంచిన సర్కార్..
Puzzle Picture: ఇదికదా అసలైన ఛాలెంజ్.. ఈ ఫోటోలో ఎన్ని పిల్లులు ఉన్నాయో చెప్తే మీరే జీనియస్..!