Puzzle Picture: ఇదికదా అసలైన ఛాలెంజ్.. ఈ ఫోటోలో ఎన్ని పిల్లులు ఉన్నాయో చెప్తే మీరే జీనియస్..!
Puzzle Picture: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలో, ఫోటోలు పబ్లిష్ చేస్తుంటారు యూజర్లు. అయితే, వీటిలో ఆసక్తికరమైన..
Puzzle Picture: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలో, ఫోటోలు పబ్లిష్ చేస్తుంటారు యూజర్లు. అయితే, వీటిలో ఆసక్తికరమైన వాటిని మాత్రమే నెటిజన్లు రిసీవ్ చేసుకుంటారు. అలా అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే, ఈ మధ్య కాలంలో ఫజిల్ పిక్చర్స్ ట్రెండ్‌గా మారాయి. ప్రకృతితో మమేకమైన జంతువులను కనిపెట్టే టాస్క్.. ప్రస్తుతం ట్రెండీగా మారింది. తాజాగా అలాంటి ఒక ఫజిల్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందులోనే ఉన్నదేంటో కనిపెట్టలేక నెటిజన్లు జుత్తు పీక్కుంటున్నారు. నిజంగా ఈ ఫజిల్ చూస్తే.. ఇది కదా అసలైన ఛాలెంజ్ అనేలా ఉంది.
వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఏముందో ఒకసారి చూద్దాం. ఈ ఫోటోలో జంగల్‌లో కొన్ని పిల్లులు కూర్చుకున్నాయి. సహజంగా రకరకాల రంగులలో ఉంటాయి పిల్లులు. ఈ పిల్లులన్నీ వచ్చి జంగల్‌లో చెట్ల కింద ప్రశాంతంగా సేద తీరుతున్నాయి. అయితే, చూడటానికి ఇందులో రెండు మూడు పిల్లులు మాత్రమే కనిపిస్తున్నప్పటికీ.. వాస్తవానికి అందులో మరికొన్ని పిల్లులు కూడా ఉన్నాయి. అక్కడి చెట్ల రంగులో కలిసిపోవడంతో కొంచెం కొంచెంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడిదే పెద్ద టాస్క్‌గా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది ఫోటో. ఈ ఫోటోలో వాస్తవంగా ఎన్ని పిల్లులు ఉన్నాయో చెప్పాలంటూ యూజర్ ఛాలెంజ్ విసిరారు. చాలామంది దీనికి సరైన ఆన్సర్ చేయలేకపోయారు. మరి మీరు ఆ ఛాలెంజ్‌ను స్వీకరించి.. అందులో ఎన్ని పిల్లులు ఉన్నాయో చెప్పగలరా? ఇందులో ఎన్ని పిల్లులు ఉన్నాయో చెప్పగలిగితే.. నిజంగా మీరే జీనియస్ అని చెప్పొచ్చు.
Find How Many Cats In This Picture@WhatsTrending @TrendingWeibo @TheViralFever @the_viralvideos @itsgoneviraI #Trending #Viral pic.twitter.com/qAmbcrIcSs
— telugufunworld (@telugufunworld) March 21, 2022
Also read:
RBI Assistant Exam 2022: ఆర్బీఐ అసిస్టెంట్ మెయిన్స్ 2022 హాల్ టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..
Ajith Valimai: ఇక ఓటీటీలో సందడి చేయనున్న అజిత్.. బ్లాక్ బస్టర్ వలిమై స్ట్రీమింగ్ ఎప్పుడంటే..