RBI Assistant Exam 2022: ఆర్బీఐ అసిస్టెంట్ మెయిన్స్ 2022 హాల్ టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష (RBI Assistant Prelims)కు సంబంధించిన హాల్ టికెట్లు నేడు (మార్చి 21) విడుదలయ్యాయి..
RBI Assistant Admit Card 2022 released: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష (RBI Assistant Prelims)కు సంబంధించిన హాల్ టికెట్లు నేడు (మార్చి 21) విడుదలయ్యాయి. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ rbi.org.inలో అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఆర్బీఐ ప్రిలిమినరీ పరీక్ష మార్చి 26, 27 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్ధులకు మెయిన్ పరీక్ష మేలో నిర్వహిస్తారు. కాగా పలు ఆర్బీఐ బ్రాంచ్‌లలో 950 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు), లాంగ్వేజ్ ప్రొఫిషెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,000ల నుంచి రూ.28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
RBI Assistant Admit cardలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
- ముందుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ rbi.org.inను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్‌పేజ్‌లో వేకెన్సీస్ ట్యాబ్‌పై క్లిక్ చేసి, తర్వాత ఆర్బీఐ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
- సరైన ఆధారాలను నమోదు చేసి సబ్‌మిట్ చెయ్యాలి.
- వెంటనే ఆర్బీఐ అసిస్టెంట్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ ఔట్ తీసుకోవాలి.
Also Read: