Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా జీతాలు పెంచిన సర్కార్..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న గిరిజన ప్రాంతాల స్పెషలిస్టు డాక్టర్లకు వేతనాలను భారీగా పెంచింది. 30 శాతం నుంచి 50 శాతం వరకు జీతాలు పెంచుతూ వైద్యాఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్న స్పెషలిస్టు డాక్టర్లకు 30 నుంచి 50 శాతం వరకు జీతాలను ప్రభుత్వం పెంచింది. ఏపీవివిపి పరిధిలోని ఆస్పత్రుల్లో పని చేసే స్పెషలిస్టు డాక్టర్లకు 50 శాతం, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు( జనరల్), డిఎఎస్ లకు 30 శాతం మేర జీతాలు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. పెంచిన జీతాలు మార్చి 1వ తేదీ నుంచే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also read:
Trending News: అక్కడ టీ తాగి కప్ పడేయరు.. తినేస్తారు.. దీని స్పెషాలిటీ తెలిస్తే అవాక్కవుతారు..!
Jayalalitha Death Mystery: జయలలిత మృతిపై విచారణ.. సంచలన కామెంట్స్ చేసిన ఓపీఎస్..