Disha App: దిశ కేసుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు.. చట్టం అమలు తీరుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష..
దిశ యాప్, చట్టం అమలుపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM YS Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించారు. ఏపీలో ప్రతి మహిళా సంక్షేమం అనే నినాదంతో ముందుకెళ్ళాలి అని సూచించారు. నేర నిరోధం కోసం..
దిశ యాప్, చట్టం అమలుపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM YS Jagan Mohan Reddy) సమీక్ష నిర్వహించారు. ఏపీలో ప్రతి మహిళా సంక్షేమం అనే నినాదంతో ముందుకెళ్ళాలి అని సూచించారు. నేర నిరోధం కోసం సమస్యాత్మక ప్రాంతాలలో అతి త్వరలో 163 దిశ పెట్రోలింగ్ వెహికల్స్ ప్రారంభించనున్నట్లుగా సీఎం జగన్ ప్రకటించారు. వీటితో పాటు 18 దిశ మొబైల్ రెస్ట్‌రూమ్స్ అందుబాటులోకి రానున్నట్లుగా వెల్లడించారు. ప్రతీ గడపకూ దిశ చేరాలి.. ప్రతీ మహిళా దిశ యాప్ వినియోగించాలన్నారు. ఇప్పటివరకూ దిశ యాప్ డౌన్‌లోడ్స్ – 1.16 కోట్లుకు చేరిందిని అన్నారు. దిశ యాప్ నొక్కగానే వెంటనే స్పందించాలి, అతి తక్కువ సమయంలో చేరుకుని ఆపన్నహస్తం అందించాలన్నారు. దిశ పీఎస్‌కు వచ్చే ప్రతీ కేస్ కూడా శిక్ష పడేవరకూ రెగ్యులర్‌గా మానిటర్ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు బాధితులతో మాట్లాడి వారికి స్వాంతన కలిగించాలన్నారు. కన్విక్షన్ పెరిగే దిశగా త్వరితగతిన ఎవిడెన్స్ సేకరించాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఇప్పటివరకూ 92.7 శాతం కేసులు చార్జిషీట్లు వేసినట్లు సీఎంకి వివరించిన అధికారులు. దిశ పై సోషల్ మీడియా ద్వారా కెపాసిటీ బిల్డింగ్ చేయడంతో పాటు, పనితీరు మెరుగుపరిచేలా రోజువారీ సమీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామ వలంటీర్, మహిళా పోలీస్‌ను భాగస్వామ్యం చేయాలి, ప్రతీ 15 రోజులకోసారి దిశపై హైపవర్ కమిటీ రివ్యూ చేయాలన్నారు.
దిశ యాప్ ద్వారా వచ్చే కాల్స్, కేసుల్లో ఎట్టి పరిస్ధితుల్లో అలసత్వం ప్రదర్శించకూడదని అన్నారు. ఒకవేళ అలా జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం జగన్.
ఇవి కూడా చదవండి: Viral Video: లక్ష్యం కోసం రోజూ అర్ధరాత్రి 10 కి.మీటర్ల పరుగు.. ఎందుకో తెలుసా..?
Sunny Leone: కూతురు నిషాను పట్టించుకోవడం లేదని ఆరోపించిన ట్రోలర్లకు సన్నీలియోన్ కౌంటర్..