AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: లక్ష్యం కోసం రోజూ అర్ధరాత్రి 10 కి.మీటర్ల పరుగు.. ఎందుకో తెలుసా..?

ప్రతిరోజూ వివిధ రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతున్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే అలాంటి హర్ట్ టచ్చింగ్ వీడియోలు ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఈరోజుల్లో బాగా వైరల్..

Viral Video: లక్ష్యం కోసం రోజూ అర్ధరాత్రి 10 కి.మీటర్ల పరుగు.. ఎందుకో తెలుసా..?
Midnight Run In Noida Goes
Sanjay Kasula
|

Updated on: Mar 21, 2022 | 3:16 PM

Share

ప్రతిరోజూ వివిధ రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతున్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే అలాంటి హర్ట్ టచ్చింగ్ వీడియోలు ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఈరోజుల్లో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఓ యువకుడు రాత్రి 12 గంటల సమయంలో రోడ్డుపై పరుగెత్తుతున్న దృశ్యాన్ని మనం ఇందులో చూడవచ్చు. నిజానికి ఇందులోని యువకుడు ఆర్మీలో చేరడానికి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే అతని పూర్తి కథ మీకు తెలిస్తే.. మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియోను సోషల్ మీడియాను వినోద్ కప్రీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో  ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. అసలైన విషయం ఏమిటంటే.. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో అర్ధరాత్రి 12 గంటలకు ఓ 19 ఏళ్ల యువకుడు భుజానికి బ్యాగ్‌ తగిలించుకుని రోడ్డుపై వేగంగా పరిగెడుతూ వెళ్తున్నాడు.

అటుగా వెళ్తున్న బాలీవుడ్‌ దర్శకుడు వినోద్‌ కాప్రి ఆ యువకుడిని చూసి.. ‘అయ్యో ఏదో సమస్యలో ఉన్నట్లున్నావ్‌.. లిఫ్ట్‌ ఇవ్వనా’ అని అడిగాడు. కానీ ఆ యువకుడు సున్నితంగా తిరస్కరించాడు. ఎందుకు అని అడిగితే అతడు చెప్పిన సమాధానం.. ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారడమే గాక.. ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతోంది. ఇంతకీ ఎవరా యువకుడు.. ? ఎందుకు అలా పరిగెడుతున్నాడు..? పూర్తి వివరాలను మనం ఈ కింది వీడియోలో చూద్దాం..

ఇలా అర్ధరాత్రి పరుగులు పెడుతున్న యువకుడిది ఉత్తరాఖండ్‌. 19 ఏళ్ల ప్రదీప్‌ మెహ్రాది నిరుపేద కుటుంబం. నోయిడాలో తన సోదరుడితో కలిసి ఉంటూ స్థానికంగా మెక్‌ డోనాల్డ్స్‌లో పనిచేస్తున్నాడు. తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తను పని చేసే స్టోర్‌ నుంచి ఇంటికి 10 కిలోమీటర్ల దూరం. రోజూ విధులు ముగించుకున్న తర్వాత అర్ధరాత్రి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంటాడు. అయితే శనివారం అర్ధరాత్రి అలా పరిగెడుతూ వెళ్తోన్న ప్రదీప్‌.. దర్శకుడు వినోద్‌ కాప్రి కంటపడ్డాడు.

వినోద్‌ కారును స్లో చేసి లిఫ్ట్‌ ఇస్తానని చెప్పాడు. ఇందుకు ఆ యువకుడు తనకు లిఫ్ట్‌ వద్దని, రోజూ ఇలాగే పరిగెడుతానని అన్నాడు. దీంతో ఆశ్చర్యపడిన వినోద్‌.. అతడి గురించి మరింత తెలుసుకోవాలనుకున్నాడు. వారి మధ్య సంభాషణ చాలా సేపు అలా సాగింది.

ఇప్పుడు ప్రదీప్ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది.. అతని అద్భుతమైన స్ఫూర్తికి ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. అయితే ఇది చూసిన మినర్వా అకాడమీ పంజాబ్ యజమాని రంజిత్ బజాజ్ ప్రదీప్‌కు ఇక్కడ శిక్షణ ఇప్పిస్తానని కూడా ఆఫర్ చేశాడు.

ఇవి కూడా చదవండి: Viral Video: బైక్‌తో పాటు గాల్లో పల్టీలు కొట్టిన రేసర్.. షాకింగ్ వీడియో

IT Alert: మార్చి 31 వచ్చేస్తోంది.. ఈ విషయాలు పూర్తి చేశారా.. వెంటనే కంప్లీట్ చేయండి..