Funny Video: బాబోయ్ వీడు మామూలోడు కాదు.. పోలీసులకే మస్కా కొట్టాడు.. సీన్ కట్ చేస్తే నవ్వులే నవ్వులు..!
Viral Video: మ్యాజిక్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. భారతీయులు ఇంద్రజాలంగా పిలుచుకునే ఈ వినూత్న..
Viral Video: మ్యాజిక్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. భారతీయులు ఇంద్రజాలంగా పిలుచుకునే ఈ వినూత్న కళకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశీయ గారడీ విధ్యలకు జనాలు ఫిదా అయిపోతుంటారు. విదేశాల్లోనూ ఇలాంటి మ్యాజిక్స్ టీవీ షోల్లో మనం చూస్తూనే ఉంటాం. తమ మ్యాజిక్‌తో వింతలు సృష్టిస్తారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారు ఇంద్రజాలకులు(మెజీషియన్స్). స్కూళ్లు, కాలేజీలలో, వివిధ వేదికలపై మ్యాజీక్ షో లు నిర్వహిస్తూ ప్రజలను అలరిస్తుంటారు.
అయితే, ఈ మధ్య కాలంలో రోడ్లపైన మ్యాజిక్ ప్రదర్శించడం ట్రెండీగా మారింది. రద్దీ ప్రదేశాల్లో చిన్న చిన్న మ్యాజిక్స్ చేసి ప్రజలను అకట్టుకుంటున్నారు. ఇలాంటి విధానాలు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉంది. తాజాగా ఇలాంటి మ్యాజిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మెజీషియన్ వేషం వేసిన ఓ వ్యక్తి.. రోడ్డుపై మ్యాజిక్ చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో రోడ్డుపై పోలీస్ వాహనం నిలిపి ఉండగా.. అక్కడికి వెళ్లాడు. పోలీసుల ముందు విన్యాసం చేసే ప్రయత్నం చేశాడు. ఒక క్లాత్‌ను వారికి చూపిస్తూ అటూ ఇటూ షేక్ చేశాడు. ఆ తరువాత క్లాత్‌ను వదలేసి.. అతను కారు కిందకు వంగాడు. అలా మోకాళ్లపై పాకుతూ.. కారుకు అవతలివైపు వెళ్లాడు. అంటే.. ఇక్కడ మాయమై.. అక్కడ ప్రత్యక్షమైనట్లు బిల్డప్ ఇవ్వబోయాడన్న మాట. ఈ ఫన్నీ స్కిట్‌ను చూసిన అక్కడి ప్రజలు కడుపుబ్బా నవ్వుకున్నారు. ఇక పోలీసులను ఫూల్స్ చేసేందుకు అతను చేసిన ప్రయత్నాన్ని.. కొందరు తమ కెమెరాల్లో రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు.
View this post on Instagram
Also read:
Puzzle Picture: ఇదికదా అసలైన ఛాలెంజ్.. ఈ ఫోటోలో ఎన్ని పిల్లులు ఉన్నాయో చెప్తే మీరే జీనియస్..!
Trending News: అక్కడ టీ తాగి కప్ పడేయరు.. తినేస్తారు.. దీని స్పెషాలిటీ తెలిస్తే అవాక్కవుతారు..!
Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా జీతాలు పెంచిన సర్కార్..