ఈ రోజు ఏకాదశి ఉపవాసం ఉన్నారా..! ఉపవాస విరమణ శుభ సమయం, నియమాలు ఏమిటంటే
ఉత్థాన ఏకాదశి రోజున చేసే పూజలు, ఉపవాసం విష్ణువుకు అంకితం చేయబడ్డాయి. ఈ రోజున విష్ణువు నాలుగు నెలల తర్వాత యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఈ నేపధ్యంలో ఏకాదశి రోజున ఉపవాసం ఉండి.. ఆ ఉపవాస దీక్షను విరమించే పద్ధతిని పరణ అంటారు. సరైన పద్ధతిలో పరణ అంటే ఉపవాసం విరమణ చేయడం ద్వారా ఉపవాసం చేసిన పూర్తి ప్రయోజనాలను పొందుతారు. పరణ నియమాను సారం చేయక పోతే ఆ ఉపవాసమూ సంపూర్ణంగా పరిగణించబడదు.
హిందూ మతంలో ఉత్థాన ఏకాదశి కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశిని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిధి రోజున జరుపుకుంటారు. ఈ రోజున విష్ణువు నాలుగు నెలల తర్వాత యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. కనుక ఈ ఏకాదశిని ‘ప్రబోధిని ఏకాదశి’ అని కూడా అంటారు. ఈ రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజు పవిత్రమైన పని చేయడానికి అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ ఉపవాసం మతపరమైన దృక్కోణం నుంచి చూస్తే చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఉత్థాన ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు పరణ పద్ధతిలో ఉపవాసం విరమించాలి. లేదంటే ఏకాదశి ఉపవాసం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.
హిందూ పంచాంగం ప్రకారం ఏకాదశి మర్నాడు అంటే ద్వాదశి తిథి రోజున సూర్యోదయం తర్వాత ఉత్థాన ఏకాదశి ఉపవాసాన్ని విరమించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. కార్తీక మాసం శుక్ల పక్షం ద్వాదశి తిధి నవంబర్ 13వ తేదీ ఉదయం 06:42 నుంచి 8:51 వరకు ఉపవాసం విరమణ చేయడానికి శుభ సమయం. రేపు అంటే బుధవారం ఏకాదశి ఉపవాసం విరమించి సాయంత్రం క్షీరాబ్ది ద్వాదశి పూజలను చేస్తారు. తులసి సాలిగ్రామ స్వామికి ఇంట్లో వివాహం చేస్తారు.
ఉపవాసం విరమణ విధానం లేదా పరణ పధ్ధతి ఏమిటంటే..
- ఉత్థాన ఏకాదశి వ్రతం విరమించే ముందు.. నదీ స్నానం లేదా చల్లని స్వచ్ఛమైన నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయండి.
- సూర్యోదయ సమయంలో సూర్యదేవునికి అర్ఘ్యాన్ని సమర్పించండి.
- తర్వాత విష్ణువును పూజించి, తులసి దళాలను సమర్పించి దీపం వెలిగించండి
- ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించండి.
- పరణ కోసం సాత్విక ఆహారాన్ని రెడీ చేసుకోవాలి. అంటే బియ్యంతో చేసిన పాయసం స్వచ్ఛమైన నెయ్యిని చేర్చండి, పండ్లను సిద్ధం చేసుకోండి.
- విష్ణువుకు నైవేద్యంగా ప్రసాదం సమర్పించిన ఆహరాన్ని పండ్లను ప్రజలకు ప్రసాదం పంచండి.
- అయితే విష్ణువుకు సమర్పించి నైవేద్యాలను ముందు మీరు స్వీకరించిన తర్వాత ఇతరులకు పంచండి.
- ఉపవాస విరమణ పూర్తి చేసిన తర్వాత, పేదలకు, ఆకలి అన్నవారికి దానం చేయండి.
- ఉపవాసం విరమణ సమయంలో ఈ నియమాలను పాటించడం ద్వారా మాత్రమే.. ఏకాదశి ఉపవాసం చేసిన పూర్తి ప్రయోజనాలను పొందుతారు.
ఉపవాసం విరమణ నియమాలు
- స్వచ్ఛమైన ఆహారం: పరణ కోసం స్వచ్ఛమైన, సాత్విక ఆహారాన్ని తినాలి. ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయ మొదలైనవి జోడించవద్దు
- స్వచ్చమైన మనసు: ఉపవాసం విరమణ సమయంలో మనస్సును పవిత్రంగా, స్వచ్చంగా ఉంచుకోండి.
- బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనండి: ఉపవాసం విరమణ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయండి.
- నీరు తాగవద్దు: ఉపవాసం విరమణకు ముందు నీరు త్రాగుట నిషేధించబడింది.
- విమర్శలు, చర్చలు వద్దు: ఉపవాసం విరమణ రోజున ఎవరినీ విమర్శించవద్దు లేదా ఎవరి గురించి చర్చించవద్దు.
- శుభ కార్యాల ప్రారంభం: ఈ రోజు శుభ కార్యాలు చేయడానికి అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది.
ఉత్థాన ఏకాదశి ప్రాముఖ్యత:
హిందూ మతంలో ఈ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చేసే ఉపవాసంతో శ్రీమహావిష్ణువు ప్రసన్నుడవుతాడని నమ్మకం. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తికి మతపరమైన, శారీరక , మానసిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి లభించి మోక్షాన్ని పొందుతాడని విశ్వాసం. అలాగే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. కుటుంబంలో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.