Kartika Purnima: కార్తీక పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. చంద్ర దోషం ఏర్పడుతుంది..

Kartika Pournami: కార్తీక మాసంలోని పౌర్ణమి సంవత్సరంలో అత్యంత పవిత్రమైన విశిష్టమైన పౌర్ణమిగా పరిగణించబడుతుంది. కార్తీక పౌర్ణమి రోజున పవిత్ర నదులలో స్నానాలు చేసి దీపాలు వెలిగిస్తారు. దానధర్మాలు చేస్తారు. అయితే ఈ రోజున కొన్ని పనులు చేయడం నిషేధించబడింది. అటువంటి పరిస్థితిలో కార్తీక పౌర్ణమి నాడు మనం ఏమి చేయకూడదో తెలుసుకుందాం?

Kartika Purnima: కార్తీక పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. చంద్ర దోషం ఏర్పడుతుంది..
Kartik Purnima 2024
Follow us
Surya Kala

|

Updated on: Nov 12, 2024 | 3:06 PM

హిందూ మతంలో కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ నెల ఆధ్యాత్మిక మాసం. దీపావళి నుంచి పోలి స్వర్గం వరకూ రోజూ నదీ స్నానం, పూజలు, దీప దానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదు ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి వంటి తిధులను పండగగా జరుపుకుంటారు. ఉపవాసం ఉండి ప్రత్యెక పూజలను నిర్వహిస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి సంవత్సరంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈరోజున దేవ్ దీపావళి, గురునానక్ జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు పవిత్ర నదులలో స్నానాలు చేసి తమ శక్తి మేరకు దానం చేస్తారు. పౌర్ణమి రోజున పూజ, క్రతువులు, దీపదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రోజు సనాతన ధర్మంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది.

ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 15 శుక్రవారం వచ్చింది. కార్తీక పౌర్ణమి రోజున చేయకూడని కొన్ని పనులు మత గ్రంథాలలో పేర్కొనబడ్డాయి. ఈ పనులు చేయడం ద్వారా ఒక వ్యక్తి అశుభ ఫలితాలను కూడా చూడవచ్చు. అటువంటి పరిస్థితిలో కార్తీక పౌర్ణమి రోజున ఏమి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

కార్తీక పౌర్ణమి రోజున ఏమి చేయకూడదంటే కార్తీక పౌర్ణమి అనేది మతపరంగా, ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనది. కనుక ఈ రోజున మీ ఇంటి ముందు నిలబడిన నిరుపేదలు లేదా పేదవారు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళరాదు. ఈ రోజు పేదలతో, నిస్సహాయులతో, వృద్ధులతో అనుచితంగా ప్రవర్తించరాదు.

ఇవి కూడా చదవండి

కార్తీక పౌర్ణమి రోజున ఎవరినీ నొప్పించకూడదు. ఈ రోజున ఎవరినైనా అవమానించడం వల్ల దేవుళ్ళకు కోపం వస్తుంది.

పొరపాటున కూడా కార్తీక పౌర్ణమి రోజున ఇతరులతో నిందా పూర్వకంగా మాట్లాడరాదు. ఈ రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు. మద్యం త్రాగకూడదు.

కార్తీక పౌర్ణమిరోజు దానం చేయడం చాలా మంచిది, అయితే ఈ రోజున వెండి పాత్రలు, పాలు లేదా పాల ఉత్పత్తులను దానం చేయకూడదు. వెండి పాత్రలు, పాలు దానం చేయడం వలన చంద్ర దోషం ఏర్పడవచ్చు, దీని కారణంగా వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో ఏ గదిలోనూ చీకటిగా ఉండకూడదు. అలాగే ఇంటిని మురికిగా కూడా ఉంచకూడదు. ఈ రోజు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

కార్తీక పౌర్ణమి రోజున చీకటిగా అపరిశుభ్రంగా ఉండే ఇంట్లో సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అడుగు పెట్టదు. ఆగ్రహించి ఇంటి ద్వారం వద్ద నుంచే తిరిగి వెళ్ళిపోతుందని నమ్మకం.

కార్తీక పూర్ణిమ రోజున ఏ పనులు చేయకూడదంటే

కార్తీక పౌర్ణమి రోజున వెల్లుల్లి, ఉల్లి, మాంసం, చేపలు వంటి తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఈ రోజున తెల్లని రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు.

కార్తీక పూర్ణిమ నాడు ఏమి దానం చేయాలంటే

కార్తీక పౌర్ణమి నాడు గంగాస్నానం, దీపదానం, హవన, యాగాలు మొదలైన వాటి ద్వారా ప్రాపంచిక పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రోజున అన్నదానం, ధనం, వస్త్రదానం చేయడం కూడా ఎంతో ప్రాముఖ్యమైనదని చెబుతారు. ఈ రోజున ఏ దానం చేసినా దాని వల్ల అనేక విధాల ప్రయోజనాలు కలుగుతాయి.

కార్తీక పౌర్ణమి రాత్రి ఏమి చేయాలి?

కార్తీక పౌర్ణమి రోజున తెల్లని వస్త్రాలు ధరించి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, ఎర్ర వస్త్రం మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి హారతి ఇవ్వండి. అనంతరం కార్తీక పౌర్ణమి రాత్రి చంద్ర కాంతిలో విష్ణుసహస్రనామం, లక్ష్మీ చాలీసా పారాయణం చేయాలి

కార్తీక పౌర్ణమి రోజు తల స్నానం ఎలా చేయాలంటే

కార్తీక పౌర్ణమి రోజు జుట్టు కత్తిరించకూడదు. అంతేకాదు జుట్టుని శుభ్రం చేసుకోవడానికి కుంకుడు, షాంపు వంటి వాటిని ఉపయోగించరాదు. పురాణ గ్రంధాల ప్రకారం పౌర్ణమి రోజు ఆరాధన, భక్తి , ఆధ్యాత్మికత ఉట్టిపడే రోజు కనుక ఈ రోజున జుట్టుని శుభ్ర పరుచుకోవడం, కత్తిరించడం నిషేధించబడింది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..