AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swapna Shastra: కలలో తెల్లని జంతువులు కనిపిస్తున్నాయా.. స్వప్న శాస్త్రం ప్రకారం భవిష్యత్ లో దేనికి సంకేతమో తెలుసా..!

కలలో తెల్లని జంతువులు కనిపించడం శుభప్రదమని స్వప్న శాస్త్రం పేర్కొంది. తెల్లని రంగు నిర్మలత్వానికి, స్వచ్చతకు ప్రతీక. కలలో కనిపించే ప్రతి తెల్లని జంతువుకు అర్ధం ఉంది. తెల్లని రంగు జంతువులు కలలో కనిపిస్తే మనసు శుద్ధిగా ఉందని, ఆధ్యాత్మికంగా ఎదగుతున్నామని సూచిస్తుంది. జీవితంలో కొత్త మార్పులు, కొత్త అవకాశాలు రానున్నాయని సూచిస్తున్నాయి. స్వప్న శాస్త్రం ప్రకారం తెల్లని జంతువులు వారి అర్ధాలు ఏమిటంటే..

Swapna Shastra: కలలో తెల్లని జంతువులు కనిపిస్తున్నాయా.. స్వప్న శాస్త్రం ప్రకారం భవిష్యత్ లో దేనికి సంకేతమో తెలుసా..!
White Animals In Dreams
Follow us
Surya Kala

|

Updated on: Nov 08, 2024 | 10:26 AM

ప్రతి ఒక్కరూ రాత్రి నిద్రపోవడం సహజం.. ఇలా నిద్రిస్తున్న సమయంలో రకరకాల కలలు రావడం సహజం. ఇలాంటి కలలు మనసులోని ఆలోచనలు, అనుభవాలు, భావోద్వేగాలకు ప్రతిబింబాలుగా భావిస్తారు. అంతేకాదు కొన్ని కలలు భయం కలిగిస్తే.. మరికొన్ని కలలు సంతోషాన్ని కలిగిస్తాయి. అయితే ఈ కలలు మన భవిష్యత్ గురించి కొన్ని సూచనలు ఇస్తాయని స్వప్న శాస్త్రం పేర్కొంది. ముఖ్యంగా తెల్లవారు జామున వచ్చే కలలకు అర్ధం గురించి ఆలోచిస్తూ ఉంటారు. భారతీయ శాస్త్రంలో ఒక ప్రాచీన శాస్త్రం స్వప్న శాస్త్రం.. ఇది కలల అర్థాన్ని విశ్లేషిస్తుందని పేర్కొంది. అయితే కొన్ని కలల్లో జంతువులు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు కలల్లో తెల్లని జంతువులు కనిపిస్తే వాటికి కొన్ని అర్ధాలున్నాయి. ఈ రోజు మనం కలలో తెల్లని జంతువులు కనిపించడం వెనుక ఉన్న అర్ధాన్ని తెలుసుకుందాం..

  1. తెల్ల పాము: కలలో శ్వేత వర్ణం సర్పం కనిపిస్తే అదృష్టం మీ సొంతం అవుతుందని అర్ధం. శివుని అనుగ్రహం లభిస్తుందని అర్ధం. కలల శాస్త్రం ప్రకారం, మీరు ఈ రకమైన పాము కనిపిస్తే ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. శ్వేత సర్పం జ్ఞానం, మార్పు, పునర్జన్మ, ఆధ్యాత్మిక అభివృద్ధిని సూచిస్తుంది.
  2. తెల్ల గుర్రం: కలలో తెల్ల గుర్రం కనిపిస్తే అది విజయానికి చిహ్నం. విజయవంతమైన కెరీర్, సానుకూల మార్పులు, వేగవంతమైన అభివృద్ధిని సూచిస్తుంది.
  3. తెల్ల కుక్క: కలలో తెల్ల కుక్క కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం స్నేహం, నమ్మకం, రక్షణకు సూచన అని అర్ధం.
  4. తెల్ల సింహం: ఎవరి కలలోనైనా తెల్ల సింహం కనిపిస్తే కెరీర్‌లో సక్సెస్ అందుకోనున్నారని అర్థం. వ్యాపారం చేసే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. తెల్ల కుందేలు: కలలో తెల్ల కుందేలు కనిపిస్తే కుటుంబ శ్రేయస్సుకు కొత్త ప్రారంభాలకు అదృష్టాన్ని సూచిస్తుంది. అంతేకాదు ఆర్ధికంగా లాభాలను అందుకుంటారని అర్ధం.
  7. తెల్ల ఏనుగు: స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరి కలలోనైనా తెల్ల ఏనుగు కనిపిస్తే రాజయోగం రానుందని అర్ధం అట. మన పురాణాల ప్రకారం తెల్ల ఏనుగుని ఐరావతంగా భావిస్తారు. దేవేంద్రుడి వాహనంగా పరిగణింపబడుతోంది. అందుకే తెల్లని ఏనుగు కలలో కనిపిస్తే శక్తి, బలం, స్థిరత్వం, ఆర్థిక లాభాలను సూచిస్తుంది.
  8. తెల్లని నెమలి: అరుదుగా కనిపించే పక్షి.. ఎవరి కలలోనైనా తెల్లని నెమలి కనిపిస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలని స్వప్న శాస్త్రం పేర్కొంది. త్వరలోనే భారీ సాధించనున్నారని అర్ధం అట.
  9. తెల్ల శివలింగం: తెల్లని శివలింగం కలలో కనిపిస్తే శివుని అనుగ్రహం మీపై ఉందని అర్ధం అట. శివుడు లయకారుడు.. జ్ఞానం, విజయానికి అధిదేవత. కనుక తెల్లని శివలింగం కలలో కనిపిస్తే రానున్న కాలంలో ఒక భారీ విజయం పొడనున్నారని అర్ధం అట.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

ఈ ఫుడ్స్‌ తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి..!
ఈ ఫుడ్స్‌ తింటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి..!
మన బుర్రను పాడు చేసే పనులు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి
మన బుర్రను పాడు చేసే పనులు ఇవే.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతి
రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. ప్రయాణికులను బెదిరించి..
రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. ప్రయాణికులను బెదిరించి..
తెలుగులోకి మరో కుర్ర భామ..
తెలుగులోకి మరో కుర్ర భామ..
పెళ్లికి ముందు కూతురికి షాకిచ్చిన తల్లి.. కాబోయే అల్లుడితో జంప్..
పెళ్లికి ముందు కూతురికి షాకిచ్చిన తల్లి.. కాబోయే అల్లుడితో జంప్..
పాక్‌లోనూ ఫవాద్ ఖాన్ అబీర్ గులాల్ సినిమాపై నిషేధం! కారణమిదే
పాక్‌లోనూ ఫవాద్ ఖాన్ అబీర్ గులాల్ సినిమాపై నిషేధం! కారణమిదే
వక్కలు తింటే ఇన్ని లాభాలా..? అదిరిపోయే ప్రయోజనాలు తెలిస్తే..
వక్కలు తింటే ఇన్ని లాభాలా..? అదిరిపోయే ప్రయోజనాలు తెలిస్తే..
పేడ పిచ్ మీద ప్రాక్టీస్‌తో స్టార్ బౌలర్ల దూల తీర్చిన బుడ్డోడు..
పేడ పిచ్ మీద ప్రాక్టీస్‌తో స్టార్ బౌలర్ల దూల తీర్చిన బుడ్డోడు..
ఎప్పటి వరకు పన్ను రిటర్న్ ఫైల్ చేయవచ్చు? మర్చిపోతే నష్టాలేంటి?
ఎప్పటి వరకు పన్ను రిటర్న్ ఫైల్ చేయవచ్చు? మర్చిపోతే నష్టాలేంటి?
దారితప్పి పీఎస్‌లోకి వచ్చిన చిరుత.. పోలీస్‌ తెలిగా ఏం చేశాడంటే!
దారితప్పి పీఎస్‌లోకి వచ్చిన చిరుత.. పోలీస్‌ తెలిగా ఏం చేశాడంటే!