AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Epic Story: విష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఎవరు ఇచ్చారు? శ్రీ కృష్ణుడు వద్దకు ఎలా చేరుకుందంటే

హిందూ మతంలో దేవతలు, దేవుళ్ళందరికీ ఏదో ఒక దైవిక ఆయుధం ఉంటుంది. అలాగే శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడికి కూడా సుదర్శన చక్రం ఉంది. ఈ సుదర్శన చక్రాన్ని అతనికి ఎవరు ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో తెలుసా..

Hindu Epic Story: విష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఎవరు ఇచ్చారు? శ్రీ కృష్ణుడు వద్దకు ఎలా చేరుకుందంటే
Sudarshan Chakra Epic StoryImage Credit source: Social media
Surya Kala
|

Updated on: Nov 08, 2024 | 6:59 AM

Share

దేవతలు, దేవుళ్లు వేర్వేరు ఆయుధాలను ధరిస్తారు. వాటిని వివిధ పేర్లతో పిలుస్తారు. దేవీ దేవతలకు ఈ ఆయుధాలు ఉండడానికి కొన్ని కారణాలున్నాయి. అదేవిధంగా శ్రీకృష్ణుడు చేతిలో సుదర్శన చక్రం ఆయుధంగా ఉంటుంది. హిందూ మత గ్రంథాలలో సుదర్శన చక్రాన్ని అత్యంత విధ్వంసకర ఆయుధంగా పిలుస్తారు. సుదర్శన చక్ర వివరణ పురాణ కథలలో కూడా కనిపిస్తుంది. అయితే శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రాన్ని ఎవరు ఎలా, ఇచ్చారు.

సుదర్శన చక్రం ఎలా తయారు చేయబడింది?

శివపురాణంలోని కోటి యుద్ధ సంహితలో సుదర్శన చక్రం ప్రస్తావన ఉంది. విష్ణువు కోసం సుదర్శన చక్రాన్ని శివుడు సృష్టించాడు. తరువాత దానిని విష్ణువుకు అప్పగించాడు. ఆ తర్వాత అది విష్ణువు అవతారమైన పరశురాముడిని చేరుకుంది. ఆ తర్వాత ఈ చక్రాన్ని శ్రీకృష్ణుడికి అప్పగించాడు. పురాణాల ప్రకారం మొత్తం సృష్టిలో రాక్షసుల దురాగతాలు పెరిగినప్పుడు సకల దేవతలు విష్ణువు వద్దకు వెళ్లారు. అయితే రాక్షసులను ఓడించడానికి విష్ణువుకు దివ్య ఆయుధం అవసరం అయింది. అప్పుడు శ్రీ మహా విష్ణువు కైలాస పర్వతానికి వెళ్లి శివుడిని పూజించడం ప్రారంభించాడు. విష్ణువు వెయ్యి పేర్లతో భోలాశంకరుడిని స్తుతించాడు. ప్రతి పేరుకి ఒక తామర పువ్వు చొప్పున శివయ్యకు సమర్పించడం మొదలు పెట్టాడు. అప్పుడు శివుడు.. విష్ణువును పరీక్షించడానికి వెయ్యి తామర పువ్వులలో ఒకదాన్ని దాచాడు.

ఒక పువ్వు లేకపోవడంతో విష్ణువు తన ఒక కన్ను శివునికి సమర్పించాడు. ఆ తర్వాత భోలాశంకరుడు సంతోషించి.. తాను స్వయంగా తయారు చేసిన సుదర్శన చక్రాన్ని శ్రీ హరివిష్ణువుకు సమర్పించాడు. శ్రీ హరి ఈ చక్రాన్ని ధరించాడు. ఈ సుదర్శన చక్రం సహాయంతో చాలాసార్లు దేవతలను రాక్షసుల దురాగతాల నుండి విముక్తి చేశాడు. సుదర్శన చక్రం విష్ణువు రూపంతో ముడిపడి ఉంది. దీని తరువాత శ్రీ హరి ఈ చక్రాన్ని పార్వతి దేవికి అవసరమైనప్పుడు ఇచ్చాడు. పార్వతి దేవి నుంచి ఈ చక్రం అనేక దేవతలు, దేవుళ్ళు ఉపయోగిస్తూ అలా శ్రీ మహా విష్ణువు అవతారమైన పరశురాముడిని చేరుకుంది.

ఇవి కూడా చదవండి

సుదర్శన చక్రం లక్షణాలు

శ్రీకృష్ణుని శక్తివంతమైన ఆయుధాల్లో సుదర్శన చక్రం ఒకటి అని నమ్ముతారు. ఇది చూడడానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అయితే ఇది అత్యంత శక్తి వంతమైన ఆయుధంగా పరిగణించబడింది. ఎందుకంటే ఒక్కసారి సుదర్శన చక్రం విడుదలైతే.. అది శత్రువును నాశనం చేసిన తర్వాత మాత్రమే తిరిగి దాని యజమాని చేతికి వస్తుంది. ఈ ఆయుధాన్ని ఏ విధంగానైనా ఆపడం అసాధ్యం. శ్రీ కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని విడుదల చేసిన తర్వాత అది దాడి చేయకుండా తిరిగి రాలేదు.

 మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.