AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamilnadu: ఘనంగా కందషష్ఠి ఉత్సవాలు.. ఒకవైపు సముద్రం.. మరోవైపు జనసంద్రం.. అట్టహాసంగా సాగిన శూరసంహారం

తమిళనాడులోని తిరుచెందూరులో స్కందషష్ఠి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తమిళనాడు ప్రజలకు ముఖ్యమైన పండగలలో స్కంద షష్టి ఒకటి. దాంతో.. ఈ నెల 2వ తేదీ నుంచి తిరుచెందూర్‌లో స్కంద షష్ఠి ఉత్సవాలు ప్రత్యేక పూజలతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

Tamilnadu: ఘనంగా కందషష్ఠి ఉత్సవాలు.. ఒకవైపు సముద్రం.. మరోవైపు జనసంద్రం.. అట్టహాసంగా సాగిన శూరసంహారం
Kandha Sasti Festival
Surya Kala
|

Updated on: Nov 08, 2024 | 6:46 AM

Share

తమిళనాడులో అత్యంత వైభవంగా జరిగే కందషష్ఠి ఉత్సవాలకు జనం పోటెత్తారు. భారీగా తరలివచ్చిన భక్తులతో తిరుచెందూరు ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. శూరసంహారం వేడుకల వేళ సముద్ర తీరం హరోంహర నినాదాలతో హోరెత్తింది. ఇంతకీ.. కంద షష్ఠి ఉత్సవాల స్పెషల్‌ ఏంటి?… శూరసంహారం ఎందుకు నిర్వహిస్తారు తెలుసుకుందాం..

తమిళనాడులో పండగలు ఓ రేంజ్‌లో నిర్వహిస్తుంటారు తమిళులు. అందులోనూ.. సముద్ర తీర ప్రాంతాల్లో జరిగే ఉత్సవాలకైతే జనం పోటెత్తాల్సిందే. తీరం జనసంద్రంగా మారాల్సిందే. ఆరురోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలు చివరిరోజున ప్రధాన ఘట్టమైన శూరసంహారంతో ముగుస్తాయి. ఈ క్రమంలోనే.. గురువారం శూరసంహార కార్యక్రమం కన్నులపండగగా సాగింది.

శూరసంహారంలో భాగంగా.. ముందుగా.. సుబ్రమణ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి సముద్ర తీర ప్రాంతంలో ఘనంగా ఊరేగించారు. ఊరేగింపు తర్వాత స్వామివారు రాక్షసరూపంలో ఉన్న తారకాసురుణ్ణి వధించి శూరసంహారం పూర్తి చేసి తిరిగి ఆలయంలోకి ప్రవేశించారు. ఈ శూరసంహార ఘట్టాన్ని భక్తులు వేడుకగా జరుపుకొని.. తమ ఉపవాస దీక్షలు ముగించుకున్నారు. స్కంద షష్ఠి పర్వదినాన శూరసంహారం సందర్భంగా తిరుచెందూర్‌కి భక్తులు పోటెత్తారు. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో సముద్ర తీరం జనసంద్రంగా మారింది.

ఇవి కూడా చదవండి

సుబ్రమణ్యస్వామి ఆలయాల్లో తమిళనాడులోని తిరుచెందూర్ ఆలయం ముఖ్యమైనది. ఈ క్రమంలోనే.. స్కంద ఉత్సవాల్లో శూరసంహార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. వెట్రివేల్ మురుగన్‌కు హరోంహరా.. వీరవేల్ మురుగన్‌కు హరోంహరా.. స్కందన్‌కు హరోంహరా.. అంటూ భక్తిశ్రద్ధలతో సముద్ర తీరంలో హోరెత్తించారు. మరోవైపు.. లక్షలాదిగా పోటెత్తిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. అటు.. బీచ్‌లో భారీ భద్రతా చర్యలు చేపట్టింది తమిళనాడు ప్రభుత్వం. 4,500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించింది. మొత్తంగా.. తమిళనాడు తిరుచెందూర్ ఆలయంలోని స్కంద ఉత్సవాల్లో శూరసంహారం అంగరంగ వైభవంగా పూర్తయింది. శూరసంహార ఉత్సవానికి సంబంధించి డ్రోన్‌ విజువల్స్‌ ఆకట్టుకున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..