- Telugu News Photo Gallery Spiritual photos Jagaddhatri puja 2024: Know the unique rituals and history of tetultala barowari jagaddhatri puja
Jagaddhatri Puja 2024: అమ్మవారికి చీరలు ధరించి పూజలు చేసే పురుషులు.. 230 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంప్రదాయం.. ఎక్కడంటే..
ఆ అమ్మవారే ప్రపంచం.. అందుకే ఆమె పేరు జగద్ధాత్రి దేవి. భారీ రూపం, తీవ్రమైన చూపు, అద్భుతమైన అందమైన రూపం, అసురులను సంహరించడానికి ఆయుధాలను చేపట్టిన నాలుగు చేతులు, సింహ వాహిని దేవిని పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిలాల్లో కొన్ని ప్రాంతాల్లో జగద్ధాత్రి దేవిని పూజిస్తారు. జిల్లాలోని చందన్నగర్ పట్టణంతో పాటు భద్రేశ్వర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొని ఉంది. జగద్ధాత్రి దేవి పూజను ఘనంగా జరుపుతున్నారు. ఈ పండుగ సందర్భంగా అమ్మవారు "బురిమా" అవతారంలో భక్తులకు దర్శనిమిస్తుంది.
Updated on: Nov 08, 2024 | 8:31 AM

జగద్ధాత్రి దేవి పూజ సందర్భంగా అమ్మవారిని బెనారసీ చీరలతో అలంకరిస్తారు. అమ్మవారికి ఈ చీరలను కానుకలుగా సమర్పిస్తారు. అంతేకాదు చీరలు ధరించిన పురుషులు చేస్తారు. అది కూడా కోల్ కతాకు పేరు తెచ్చిన బెనారసీ చీరలను ధరించి పూజలు చేస్తారు. ఈ సంప్రదాయం గత 230 సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. నేటికీ జగద్ధాత్రి పూజ కూడా అంతే ఉత్సాహంగా జరుగుతుంది.

చందన్నగర్ పట్టణంలోని ప్రజలు ‘హేమంతికా’ దేవతను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఎత్తైన భారీ విగ్రహంతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తుంది. భక్తులతో పూజలను అందుకుంటుంది.

ఇక్కడ అమ్మవారికి జరిపే పూజ వయస్సు 300 సంవత్సరాలు.. ఈ పూజలో పూజింపబడే దేవతను కొన్ని చోట్ల 'రాణిమా' అని.. ఇతర చోట్ల 'బురిమా' అని పిలుస్తారు. కాగా భద్రేశ్వర్‌లోని 232 ఏళ్ల సాంప్రదాయం పాత టెంటులతల బార్వారిజగద్ధాత్రి పూజ. ఇక్కడ జరిగే పూజను దర్శించుకోవడానికి ప్రతీ ఏడాది లక్షలాది మంది భక్తులు వస్తారు.

బురిమా పూజకు ముందు బురిమాను చీరతో అలంకరించే ఆచారం కూడా వెరీ వెరీ స్పెషల్.. అమ్మవారి అలంకరణ చూసేందుకు కూడా భారీ సంఖ్యలో భక్తులు దేవాలయం వద్ద చేరతారు.

ఈ పూజకు సంబంధించిన ఓ చారిత్రక నేపధ కథ ఉంది. నదియా రాజు కృష్ణచంద్ర కూడా ఈ పూజతో సంబంధం ఉంది. ఈ పూజ అతని దివాన్ చేతుల మీదుగా ప్రారంభమైందని వినికిడి. దివాన్ ఇంట్లోనే జగద్ధాత్రి పూజను ప్రారంభించారు. కృష్ణచంద్ర అనుమతితో దివాన్ ఇద్దరు వితంతు కుమార్తెలు ఇంట్లో జగద్ధాత్రి పూజ ప్రారంభించారు. ఈ వ్యక్తిగత పూజ కాలక్రమంలో బార్వారి పూజగా మారింది. తర్వాత టెంటులతల బార్వారి అని పేరు వచ్చింది.

దివాన్ దాతారం సూర్ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో.. ఆ ఇంట్లో జరిపించే పూజ వీధుల్లోకి వచ్చింది. బర్వారీ పూజ అయింది. అయితే అప్పట్లో ఆడపిల్లలు ముసుగు ధరించే సంప్రయం ఉండేది. ఎవరి ఇంటి ఆడపిల్లలు అయినా బయటకు వచ్చినా వారి ముఖ్యం ఒక తెర వెనుక ఉండాల్సి వచ్చేది.

ఇంట్లోని స్త్రీలు ప్రజల ముందు తమ ముఖంపు ఉన్న మేలి ముసుగు ఎత్తడంపై కఠినమైన నిషేధం ఉంది. దీంతో అమ్మవారి పూజ పనులు ఎవరు చేయాలి అన్న సమస్య ఏర్పందింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పూజ ముగింపులో దశమి నాడు అమ్మవారిని ఎవరు స్వాగతిస్తారు?

పురుషులే ముందుకు వచ్చారు. పురుషులు చీరలు కట్టుకున్నారు. స్త్రీల వేషధారణతో అమ్మవారికి స్వాగతం పలికే వారు. నాటి నుంచి నేటి వరకు అమ్మవారిని స్వాగతించడానికి ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. 13 మంది పురుషులు చీరలు ధరించి తలపై ముసుగులు ధరించి అమ్మవారికి స్వాగతం పలుకుతారు.

బురీమా పూజకు చీరకు ఎంతో సంబంధం ఉంది. ఈ పూజలో ప్రత్యేకంగా దశమి రోజున అమ్మవారిని ఆహ్వానించడానికి పురుషులు స్త్రీల మాదిరిగా చీరలు ధరించి తలపై ముసుగు వేసుకుని టెంటులతల బార్వారి అమ్మవారిని ఆహ్వానిస్తారు.

ప్రతీ ఏడాది చతుర్థీ పంచమి సందర్భంగా భక్తులు అమ్మవారికి కొత్త చీరలను సమర్పిస్తారు. ఈ చీరలను అమ్మవారిని అలంకరించడానికి ఉపయోగిస్తారు. ఈ ఏడాది సుమారు 225 బెనారసీ చీరలను అమ్మవారికి సమర్పించారు. ఈ చీరలను ధరించిన పెళ్ళికాని యువతులకు పెళ్లి అవుతుందని నమ్మకం. అందుకే ప్రతీ సంవత్సరం బురిమా చీరలను ప్రసాదంగా తీసుకోవడానికి భారీ సంఖ్యలో ప్రజలు ఎదురు చూస్తూ ఉనారు. ముఖ్యంగా బెనారసీ చీరలను పేద పిల్లల వివాహాలకు ప్రసాదంగా అందిస్తారు.

నిర్మలమైన మనస్సుతో అమ్మవారిని పూజ సమయంలో ఏదైనా అడిగితే ఆ కోరికలు నెరవేరుతాయి. నేటికీ ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో అమ్మవారి పూజకు తరలివస్తారు. బెనారస్ చీరలను మొక్కలుగా సమర్పించుకుంటారు. (All Photo -Getty Images)




