Andhra Pradesh: క్యాన్సర్ పై యుద్ధం చేసేందుకు ఏపీ సిద్ధం.. 9 నెలల పాటు క్యాన్సర్‌ స్క్రీనింగ్ డ్రైవ్‌

ప్రధానంగా.. క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్న దేశాల్లో చైనా టాప్‌లో ఉంటే.. ఆ తర్వాత అమెరికా.. మూడవ స్థానంలో భారత్ ఉండడం షాకిస్తోంది. అయితే.. క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడం, క్యాన్సర్‌ను మొదట్లోనే గుర్తించక పోవడమే కారణం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే.. క్యాన్సర్‌పై సమరహోరు సాగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.

Andhra Pradesh: క్యాన్సర్ పై యుద్ధం చేసేందుకు ఏపీ సిద్ధం.. 9 నెలల పాటు క్యాన్సర్‌ స్క్రీనింగ్ డ్రైవ్‌
Ap Cancer Screen
Follow us
Surya Kala

|

Updated on: Nov 08, 2024 | 6:28 AM

క్యాన్సర్‌పై ఏపీ ప్రభుత్వం యుద్ధం చేసేందుకు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టబోతోంది. త్వరలోనే ఏపీ వ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రజలకు అవగాహన కల్పంచడంతోపాటు ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్‌ను పారదోలేందుకు చర్యలు తీసుకోబోతోంది. ఇంతకీ..ఈ కేన్సర్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది?.. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల ప్రక్రియ ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం..

టాప్‌లో చైనా, అమెరికా.. మూడవ స్థానంలో భారత్

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ 2022 రిపోర్ట్‌ ప్రకారం ప్రతి ఏటా దాదాపు 2 కోట్ల మంది క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతున్నారు. క్యాన్సర్‌తో మరణిస్తున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది.  ఏపీ నుంచి క్యాన్సర్‌ మహమ్మారిని తరిమికొట్టేందుకు తొమ్మిది నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. విజయవాడలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్‌కు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ కేసుల దృష్ట్యా.. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని నిర్ణయించామన్నారు. ఏపీలో 18 ఏళ్లు నిండిన 3.94 కోట్ల మందికి నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ పరీక్షలను వారి ఇళ్ల వద్దే ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ డ్రైవ్‌పై సెలబ్రిటీలతో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి సత్యకుమార్‌.

క్యాన్సర్ నివారణకు ఏడాదికి రూ.700 కోట్లు ఖర్చు

ఇక.. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ డ్రైవ్‌ కోసం లెక్కలతో ప్రత్యేక కార్యచరణ రూపొందించింది ఏపీ ప్రభుత్వం. 18 ఏళ్లు పైబడిన దాదాపు 2 కోట్ల మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ టెస్టులు, 30 ఏళ్లు పైబడిన 1.63 కోట్ల మంది మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు చేస్తామన్నారు మంత్రి సత్యకుమార్‌. ఈ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ డ్రైవ్‌లో ఆరోగ్య సిబ్బంది పూర్తి అవగాహనతో పనిచేయాలనే ఉద్దేశ్యంతో హోమీ బాబా క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌ సారథ్యంలో ఇప్పటికే ట్రైనింగ్‌ పూర్తయిందని చెప్పారు. దాదాపు 18 వేల మంది ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సేవలు అందిస్తారని.. వారిలో 15 వేల మంది ఏఎన్ఎంలు, 3 వేల మంది కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్లు,125 మంది ఆంకాలజీ స్పెషలిస్టులు ఉంటారన్నారు. ఈ డ్రైవ్‌లో గుర్తించిన క్యాన్సర్ బాధితులను రిఫరల్ ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. అలాగే.. సమగ్ర ఆరోగ్య సర్వేలో భాగంగా నిర్వహించే ఈ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ డ్రైవ్‌లో షుగర్, బీపీ, హీమోగ్లోబిన్ మోతాదు లాంటి టెస్టులు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీలో క్యాన్సర్ నివారణకు ఏడాదికి దాదాపు 700 కోట్లు ఖర్చు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు మంత్రి సత్యకుమార్‌.

ఇవి కూడా చదవండి

మొత్తంగా.. క్యాన్సర్‌ మహమ్మారిపై ఏపీ ప్రభుత్వం పోరాటానికి దిగింది. హోమీ బాబా ఇనిస్టిట్యూట్‌ సాయంతో ఏపీని క్యాన్సర్‌ ఫ్రీ స్టేట్‌గా మార్చేందుకు డిసైడ్‌ అయింది. ఈ నేపథ్యంలోనే.. క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్‌ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని.. క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిదేందుకు సహకరించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ