Onion Price: కొనకుండానే కన్నీరు పెట్టిస్తోన్న ఉల్లి.. కర్నూలు మార్కెట్‌లో మండుతున్న ఉల్లి ధరలు

ఉల్లి ధరలు కేవలం కొన్ని రోజుల్లోనే అమాంతం పెరిగిపోయాయి. ఓ వైపు పండగ సీజన్.. మరోవైపు పెళ్ళిళ్ళ సీజన్ రానుండడంతో ఉల్లిధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్ లో నెల రోజుల క్రితం వరకూ కిలో రూ. 25 లు ఉండగా ఇప్పుడు కిలో రూ. 60 నుంచి రూ. 80 లకు చేరుకుంది. అయితే త్వరలోనే ఉల్లి ధర కేజీ సెంచరీ కొట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అంటున్నారు వ్యాపారులు

Onion Price: కొనకుండానే కన్నీరు పెట్టిస్తోన్న ఉల్లి.. కర్నూలు మార్కెట్‌లో మండుతున్న ఉల్లి ధరలు
Onion Price Hike
Follow us
Surya Kala

|

Updated on: Nov 08, 2024 | 7:37 AM

భారతీయులు చేసే ప్రతి వంటకంలో ఉల్లి తప్పని సరి.. దీంతో ఉల్లిపాయను ఉపయోగించని భారతీయుల ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు.. అయితే గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు అమాంతం పెరిగి కోయకుండానే వినియోగదారులతో కన్నీరు పెట్టిస్తున్నాయి. తెలుగురాష్ట్రాల్లో కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు ఎక్కువగా ఉంటుంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే యాభై వేల ఎకరాలలో ఉల్లి సాగవుతుంది. అయితే ఇక్కడ ఉల్లి దిగుబడి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో కర్నూలు మార్కెట్ లో ఉల్లి ధర మరింత పెరిగింది. మొదటి రకం ఉల్లి క్వింటాల్ 4888 రూపాయలు పలుకుతుండగా… మీడియం సైజ్ ఉల్లి ధర క్వింటాల్ కు 3919 రూపాయలు పలుకుతోంది. ఉల్లి ధరలు పెరుగుతుండడంతో ఉల్లి రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా… వినియోగదారులు మాత్రం ఉల్లితో కూర అంటేనే ఆలోచించాల్సిన పరిస్తితి ఏర్పడింది అని అంటున్నారు.

ఇలా ఉల్లి ధరలు పెరగడానికి కారణం తెలుగు రాష్ట్రాలతో పాటు మహా రాష్ట్రలో కురిసిన భారీ వర్షాలు అని తెలుస్తోంది. భారీ వర్షాలకు ఉల్లి పంట దెబ్బతిందని.. దీంతో దిగుబడి తగ్గి.. డిమాండ్ కు తగినంత ఉల్లి పాయలు సప్లై అవ్వడం లేదని.. అందుకనే ఉల్లి ధరలు రోజు రోజుకీ పై పై కి చేరుకోవడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. హైదరాబాద్ లో కూడా ఉల్లి కొరత ఏర్పడింది. ప్రధాన మార్కెట్ లో కూడా ఉల్లి ధరలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఉల్లి ధరలు పెరగడంతో ఇంట్లోనే కాదు హోటల్స్, రెస్టారెంట్స్ నుంచి స్ట్రీట్ ఫుడ్ విక్రేతల వరకూ ఉల్లి పాయ వినియోగాన్ని తగ్గించారు. నో ఆనియన్స్ ప్లీస్ అనేస్తున్నారు కూడా కొన్ని చోట్ల.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..