Andhra Pradesh: సోషల్ మీడియా చుట్టూ ఏపీలో పొలిటికల్ హీట్

కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలన్నీ సోషల్ మీడియా చుట్టూ తిరుగుతున్నాయి. అటు వరుస అరెస్టులు, ఇటు అగ్రనేతల కామెంట్లతో కాకరేగుతోంది. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. వాటికి అధికారపక్షం కూడా వెంటనే కౌంటర్ ఇచ్చింది. ఇక షర్మిల కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది.

Andhra Pradesh:  సోషల్ మీడియా చుట్టూ ఏపీలో పొలిటికల్ హీట్
TDP Vs YCP
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 08, 2024 | 8:40 AM

సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. తప్పుడు పోస్టులు పెట్టేవాళ్లను వెతికిమరీ పట్టుకుని అధికారులు కటకటాల్లోకి పంపిస్తున్నారు. ఈ పరిణామాలతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.

సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులను వైసీపీ తప్పుబడుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని అరెస్ట్ చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వ తీరును జగన్ తప్పుబట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని నిలదీశారు.

అయితే మహిళల పట్ల అసభ్యకర పోస్టులు పెట్టేవాళ్లు, వ్యక్తిత్వ హననానికి పాల్పడే వాళ్లను వదిలిపెట్టాలా అని నిలదీశారు సీఎం చంద్రబాబు. మదమెక్కి ఆంబోతుల్లాగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మదమెక్కి, కొవ్వుపట్టి పోస్టులు పెట్టేవాళ్లను వదిలెయ్యాలా? అని ప్రశ్నించారు.

తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని పేర్నినాని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసి టీడీపీ నేతల కాళ్లు పట్టిస్తున్నారన్నారని ఆరోపించారు. సైకో పార్టీలతో కొంత మంది సైకోలు కలిసి సోషల్ మీడియాలో నీచంగా ప్రవర్తిస్తున్నారంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మహిళలు అనే జ్ఞానం లేకుండా, ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి కూడా సాటి మహిళా అనే ఇంగితం లేకుండా.. వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అసభ్యకర పోస్టులు, వ్యక్తిత్వ హననానికి పాల్పడేవాళ్లను కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?