AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: అతి సర్వత్రా వర్జయేత్.. తెగ నిద్రపోతున్నారా.. ఎన్ని జబ్బులకు వెల్కం చెబుతున్నారో తెలుసా..

అతి సర్వత్రా వర్జయేత్ అని అన్నారు పెద్దలు. అవును అతిగా చేసేది ఎప్పుడూ హానికరమే.. తక్కువ నిద్ర పోవడం ఏ విధంగా హనికరమో.. అదే విధంగా ఎక్కువగా నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి హానికరం. ఎక్కువ నిద్రపోయేవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది రాత్రంతా నిద్రపోయినా ఉదయమే నిద్ర లేవకుండా.. సూర్యోదయం తర్వాత కూడా చాలా గంటలు నిద్రపోతారని పరిశోధనలో వెల్లడైంది. అయితే ఇలా ఎక్కువ సేపు నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరమని ఒక పరిశోధనలో వెల్లడైంది.

Health Tips: అతి సర్వత్రా వర్జయేత్.. తెగ నిద్రపోతున్నారా.. ఎన్ని జబ్బులకు వెల్కం చెబుతున్నారో తెలుసా..
Health Tips
Follow us
Surya Kala

|

Updated on: Nov 08, 2024 | 9:05 AM

మనిషి రోజు వారీ దినచర్యలో నిద్ర చాలా ముఖ్యమైనది. అందుకే రాత్రి సమయంలో 7 నుంచి 8 గంటల పాటు నిద్ర ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైనది. తద్వారా మీరు మరుసటి రోజు రిఫ్రెష్‌గా ఉండగలరు. మర్నాడు చేసే పనిని పూర్తి శక్తితో చేయగలరు. ప్రతి వ్యక్తికి నిద్ర పట్టే సమయంలో భిన్నంగా ఉన్నప్పటికీ.. కొందరు ఎక్కువ సమయం నిద్రపోతారు. కొందరు తక్కువ సమయం నిద్రపోతారు. ఇది వ్యక్తి చేసే పని స్వభావం, దినచర్య ప్రకారం జరుగుతుంది. కొంతమంది తక్కువ నిద్ర పోయినా రిఫ్రెష్‌గా ఉంటారు. కొంతమంది ఎక్కువ నిద్ర పోతారు. నిద్ర లేవడానికి బద్దకిస్తారు. అయితే ఇలా ఎక్కువ నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి హానికరం.

సాధారణంగా 7 నుండి 8 గంటల నిద్ర సరిపోతుందని భావించినప్పటికీ.. చాలా మంది ప్రజలు దీని కంటే ఎక్కువ సమయం నిద్రపోతారు. ఈ అధిక సమయం నిద్రపోవడం జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది. ఎందుకంటే ఒక పరిశోధన ప్రకారం సాధారణంగా నిద్రపోయే వారి కంటే ఎక్కువగా నిద్రపోయే వ్యక్తులకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం 85 శాతం ఎక్కువ. స్ట్రోక్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మెదడుకు రక్త ప్రసరణ అడ్డుకోవడం వల్ల మెదడులోని సిరలు పగిలిపోతాయి. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు మరణించవచ్చు కూడా..

నిద్రపోయే సమయంపై మరింత పరిశోధన

ఈ పరిశోధన ప్రకారం రోజూ 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం అధిక నిద్ర వర్గంలోకి వస్తుంది. ఈ పరిశోధనలో పరిశోధకులు దాదాపు 6 సంవత్సరాలుగా ఒకే రకంగా నిద్రపోతున్న దాదాపు 31,750 మందిని ఎంచుకున్నారు. వీరి నిద్ర విధానాలపై అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వారి సగటు వయస్సు 62 సంవత్సరాలు. అంతేకాకుండా మద్యం, ధూమపానం, గుండె జబ్బుల చరిత్ర, హార్ట్ స్ట్రోక్ చరిత్ర, కొలెస్ట్రాల్ సమస్యల వంటి స్ట్రోక్‌కు ఇతర ప్రమాద కారకాలు కూడా పరిశోధనలో చేర్చబడ్డాయి.

అధ్యయనం ఏం చెబుతోందంటే

ఈ పరిశోధనలో ప్రతి రాత్రి 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వ్యక్తులకు తక్కువ నిద్రపోయే వారి కంటే 23 శాతం ఎక్కువ స్ట్రోక్ ప్రమాదం ఉందని వెల్లడైంది. పగటి సమయంలో 90 నిమిషాల పాటు అదనంగా నిద్రించే వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం 85 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ పరిశోధనలో అధిక నిద్ర వాపు, ఊబకాయం, ఇతర కారకాలతో ముడిపడి ఉందని కనుగొన్నారు.

అధికనిద్ర సమస్యను ఎలా నివారించాలంటే

  1. రెగ్యులర్ గా నిద్రపోయే సమయాన్ని రోజూ ఒకే సమయాన్ని పాటించండి.
  2. నిర్ణీత సమయానికి నిద్ర పోవడం, నిర్ణీత సమయానికి మేల్కొనడం చేయండి
  3. రాత్రిలో గరిష్టంగా 7-8 గంటల నిద్ర పోవాలి
  4. రోజూ తగిన సమయంలో నిద్ర లేచే విధంగా అలారం పెట్టుకుని తర్వాతే నిద్రపోండి.
  5. పగలు నిద్ర పోయే అలవాటుని మానుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)