AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే ఇలా చేస్తే కొలెస్ట్రాల్ ఐస్‌లా కరుగుతుందట.. సైలెంట్ కిల్లర్‌కు ఇలా చెక్ పెట్టండి

హై కొలెస్ట్రాల్ సైలెంట్ కిల్లర్ గా మారుతోంది.. కొలెస్ట్రాల్ కారణంగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదముంది.. కావున చెడు కొలెస్ట్రాల్ స్థాయిని సహజంగా తగ్గించడంలో సహాయపడే ఆహారాలను తీసుకోవాలని.. అలాగే జీవనశైలిని మార్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  

ఉదయాన్నే ఇలా చేస్తే కొలెస్ట్రాల్ ఐస్‌లా కరుగుతుందట.. సైలెంట్ కిల్లర్‌కు ఇలా చెక్ పెట్టండి
Bad CholesterolImage Credit source: Getty Images
Shaik Madar Saheb
|

Updated on: Nov 08, 2024 | 6:03 AM

Share

ప్రస్తుత కాలంలో హై కొలెస్ట్రాల్ పెను ప్రమాదకరంగా మారుతోంది.. ఇది ఊబకాయం బారిన పడేలా చేయడంతోపాటు.. ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రమాదకర జబ్బుల బారిన పడేలా చేస్తోంది.. అందుకే.. శరీరంలో కొలెస్ట్రాల్ ను నియంత్రించేందుకు ఇప్పటినుంచే జీవనశైలి, ఆహారాన్ని మార్చుకోవడం మంచిది..  కొలెస్ట్రాల్ అనేది కణ త్వచాలలో కనిపించే కొవ్వు, జిడ్డుగల స్టెరాయిడ్.. ఇది రక్త సిరల్లో ఫలకం పేరుకుపోవడానికి కారణమవుతుంది.. ఇది రక్తం సరఫరాకు అడ్డంకిని కలిగించి అధిక రక్తపోటు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు మరింత కారణమవుతుంది. అయితే.. ఉదయాన్నే కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు అవేంటో తెలుసుకోండి..

ఉదయాన్నే ఇవి తీసుకోండి..

వాల్‌నట్స్: వాల్నట్స్ లో ఎన్నో పోషకాలున్నాయి.. ప్రతిరోజూ మీ అల్పాహారంలో కొన్ని వాల్‌నట్‌లను తింటే.. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇంకా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బాదం: బాదం మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను  తగ్గిస్తుంది. ఉదయాన్నే పరగడుపున బాదంపప్పు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఉదయాన్నే వీటిని తినడం మంచిది.

ఆలివ్ నూనె: ఆలివ్ నూనెలో ఆరోగ్యానికి చాలా మంచిది.. దీంతో వంట చేసుకుని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నూనె మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అవిసె గింజలు: అవిసె గింజలలో ఎన్నో పోషకాలతో పాటు.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి.. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అవిసె గింజల పొడిని వరుసగా 3 నెలల పాటు ఉదయం తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మార్నింగ్ వాక్ – వ్యాయామం – యోగా: మార్నింగ్ వాక్, వ్యాయామం రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. రెగ్యులర్ ఏరోబిక్ వ్యాయామం రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా యోగా కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఆరెంజ్ జ్యూస్: విటమిన్ సీ పుష్కలంగా ఉన్న ఆరెంజ్ జ్యూస్ ఉదయం పూట ఒక గ్లాసు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నారింజలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి