Lady Aghori: .శ్రీకాళహస్తిలో హైడ్రామా.. ఎట్టకేలకు శివుణ్ణి దర్శించుకున్న లేడీ అఘోరీ

తిరుపతి జిల్లాలోని ప్రముఖ శైవ పుణ్య క్షేత్రం శ్రీకాళహస్తిలో లేడీ అఘోరీ రెండు సార్లు ప్రత్యక్షం అయ్యింది. శ్రీకాళహస్తి వచ్చిన లేడీ అఘోరి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం నానా యాగీ చేసింది. మధ్యాహ్న మంతా హడావుడి చేసింది. బట్టలు లేకుండా వచ్చిన అఘోరీ ని దర్శనానికి అనుమతించని సెక్యూరిటీ సిబ్బంద తో వాదన కు దిగింది.

Lady Aghori: .శ్రీకాళహస్తిలో హైడ్రామా.. ఎట్టకేలకు శివుణ్ణి దర్శించుకున్న లేడీ అఘోరీ
Aghora In Srikalahasti
Follow us
Raju M P R

| Edited By: Surya Kala

Updated on: Nov 08, 2024 | 11:06 AM

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి ఎంట్రీ ఇచ్చిన లేడీ అఘోరీ అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ.. శైవ క్షేత్రం శ్రీ కాళహస్తిలోకి అడుగు పెట్టింది. చాలా సమయం శ్రీకాళహస్తి ఆలయం వద్ద హల్చల్ చేసింది. ఒకవైపు అఘోరీ ఆశీస్సుల కోసం భక్తులు, స్థానికులు ఎగబడితే.. లేడీ అఘోరీ మాత్రం వస్త్రాలు లేకుండా ఆలయం లోనికి వెళ్లే ప్రయత్నం చేసింది. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం ప్రయత్నించింది. అయితే దేవస్థానం సిబ్బంది మాత్రం లేడీ అఘోరీనీ అడ్డుకుంది. దర్శనానికి వెళ్లేందుకు అఘోరి ప్రయత్నించటంతో ఆలయం వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆవేశంతో ఊగిపోతూ హడావుడి చేసిన లేడీ అఘోరీ వెంట తెచ్చుకున్న పెట్రోల్ క్యాన్ ను తీసి తనపై, కారు పై పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని హడావుడి చేసింది.

ఆలయ రెండో గోపురం వద్ద అఘోరీ ని అడ్డుకుని బిందెలతో నీళ్ళు పోసిన పోలీసులు.. అఘోరీ శరీరంపై మహిళా పోలీసుల చేత బట్టలు కల్పించి పరిస్థితిని అదుపు చేశారు. స్వామి దర్శనం చేసుకున్న తరువాతే తిరిగి వెళతానంటూ ఆలయం ఎదుట బైఠాయించే ప్రయత్నం లేడీ అఘోరీ చేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆలయ సిబ్బంది, పోలీసులు ఎట్టకేలకు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించి శరీర పై పెట్రోల్ పోసుకున్న లేడీ అఘోరీకి వైద్యం చేయించే ప్రయత్నం చేశారు. అయితే అందుకు అంగీకరించిన లేడీ అఘోరీనీ ఎలాగో ఒకలా ఒప్పించిన పోలీసులు శ్రీకాళహస్తి దాటించే ప్రయత్నం చేశారు. ఇక లేడీ అఘోరీ వెళ్లిపోయిందని భావించే లోపే తిరిగి శ్రీకాళహస్తి ఆలయం ముందు ప్రత్యక్షమైంది.

ఇవి కూడా చదవండి

తిరిగి దర్శనానికి వెళ్తానంటూ హడావుడి చేసింది. నగ్నంగా కాకుండా బట్టలు వేసుకొని వస్తే తప్ప దర్శనానికి అనుమతించమని దేవస్థానం అధికారులు అఘోరీ కి తేల్చి చెప్పారు. రాత్రి 8.30 గంటల సమయంలో మరోసారి శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకున్న అఘోరీకి సాంప్రదాయ వస్త్రాలను ధరించి వస్తే దర్శనం కల్పిస్తామన్న ఆలయ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఎట్టకేలకు ఎర్రని వస్త్రంతో శరీరాన్ని కప్పుకొని, కపాలమాలలు తీసి వేసి సామాన్య భక్తురాలిగా పోలీసుల బందోబస్తు తో ఆలయంలోకి వెళ్లిన అఘోరి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంది. పలువురు సీఐలు, ఎస్సైలతో పాటు ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అఘోరిని ఆలయంలోకి తీసుకెళ్ళి ముక్కంటి దర్శనం చేయించారు. అనంతరం అఘోరీ పంపిన పోలీసులు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ