యాదాద్రీశుడి సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన.. ఇకపై అన్ని రికార్డుల్లో మార్చాల్సిందే!

హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తో పాటు స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు.

యాదాద్రీశుడి సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన.. ఇకపై  అన్ని రికార్డుల్లో మార్చాల్సిందే!
Cm Revanth Reddy Yadadri
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Nov 08, 2024 | 2:43 PM

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి గడిపారు. తన బర్త్డే సందర్భంగా స్వామివారిని దర్శించుకుని సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ పాదయాత్ర నిర్వహించారు.

హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తో పాటు స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. యాదగిరిగుట్ట హెలిప్యాడ్ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్‌రూమ్‌కి వెళ్లిన సీఎం, విష్ణు పుష్కరిణి వద్ద నీళ్లను తలపై చల్లుకుని స్నాన సంకల్పం చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ కు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

ఆలయ ప్రాంగణంలో అఖండ దీపారాధనను ముందుగా దర్శించుకున్నారు. దీపం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం పలికారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, తుమ్మల, పొన్నం, కొండా సురేఖ ఉన్నారు. తర్వాత ప్రెసిడెన్షియల్ సూట్ లో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఆ తర్వాత వలిగొండ మండలంలో మూసీ ప్రవహించే సంగెం బ్రిడ్జి వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డిలు దగ్గరుండి పర్యవేక్షించారు. సీఎం పర్యటన కోసం 2వేల మందితో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్‌ సుధీర్ బాబు తెలిపారు.

మరిన్న