Telangana: సీఎం బర్త్ డే సందర్భంగా స్పెషల్ అంటే ఇదే.. ఏకంగా 54 అవతారాల్లో పెన్సిల్ ఆర్ట్స్

సీఎం రేవంత్ రెడ్డి ఇన్ని గెటప్స్ లో ఎలా ఉంటారా.. అని కూడా ఉత్సాహంతో చూసేందుకు వందలాది మంది అభిమానులు తరలి వస్తున్నారు.

Telangana: సీఎం బర్త్ డే సందర్భంగా స్పెషల్ అంటే ఇదే.. ఏకంగా 54 అవతారాల్లో పెన్సిల్ ఆర్ట్స్
Pencil Artist
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Nov 08, 2024 | 1:18 PM

ప్రతి మనిషిలోనూ.. ఒక టాలెంట్ ఉంటుంది. అదేనండీ ఒక కళ ఉంటుంది. ఆ కళను వెలికి తీస్తే ప్రతి ఒక్కరూ స్పెషల్. అంతే కాదు.. సెలబ్రిటీలు అవుతారు. మరి అలాంటి టాలెంట్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన ఒక యువతి సొంతం చేసుకుంది. ఒకే వ్యక్తి చిత్రాన్ని వేరు వేరు గెటప్‌లలో ఉన్నట్లు తెల్లని కాగితం పై పెన్సిల్ ఆర్ట్ వేస్తుంది. పెన్సిల్ ఆర్ట్ తో అద్భుతమైన చిత్రలేఖనం , కళాఖండాలు సృష్టిస్తూ.. వేలాది మందిని అబ్బుర పరుస్తుంది నిర్మల సాయిశ్రీ అనే యువతి. అయితే ఈసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సంబంధించి 54 అవతారాల్లో అద్భుత కళాఖండాన్ని సృష్టించింది.

తన తండ్రి ఒక ఫైన్ ఆర్ట్స్ కళాకారుడు. తండ్రి నుంచి అభిరుచి గా తీసుకున్న నిర్మల సాయిశ్రీ తాను కూడా చిత్రలేఖనం గీయడం ప్రారంభించింది. అల అలా.. తాను కూడా అద్భుతమైన పెన్సిల్ ఆర్టిస్ట్ గా ప్రావీణ్యం సాధించి ఎందరో మహానుభావుల చిత్రాలకు తన పెన్సిల్ ఆర్ట్ తో ప్రాణం పోసింది. ఎవరైనా ఆ చిత్రాలను చూస్తే.. జీవంతో ఉన్నాయా.. అని ఆశ్చర్యానికి లోనవుతారు. అలాంటి యువతి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్యంర్యంలో నవంబర్ 08 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో పెన్సిల్ ఆర్ట్ సాయిశ్రీ చేతుల మీదుగా 3 నెలలు శ్రమించి 54 అవతారాల చిత్రాలను గీసి ప్రాణం పోసింది. సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలలో ఆ 54 అవతారాలు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి అభిమానులను, నాయకులను ఆకట్టుకుంటుంది.

సీఎం రేవంత్ రెడ్డి ఇన్ని గెటప్స్ లో ఎలా ఉంటారా.. అని కూడా ఉత్సాహంతో చూసేందుకు వందలాది మంది అభిమానులు తరలి వస్తున్నారు. సత్తుపల్లిలోని JVR డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సిఎం రేవంత్ రెడ్డి పెన్సిల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో 54 పెన్సిల్ ఆర్ట్ చిత్రాలను ప్రదర్శించింది. పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు సత్తుపల్లి యువతి సాయిశ్రీ.

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..