TGPSC Group 3 Hall Tickets: టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్షలకు ఎగ్జాం సెంటర్లు కేటాయింపు.. మరో 2 రోజుల్లో హాల్‌ టిక్కెట్లు జారీ

టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణకు ఆయా జిల్లాల కలెక్టర్లు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యాయి..

TGPSC Group 3 Hall Tickets: టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్షలకు ఎగ్జాం సెంటర్లు కేటాయింపు.. మరో 2 రోజుల్లో హాల్‌ టిక్కెట్లు జారీ
TGPSC Group 3 Hall Tickets
Follow us

|

Updated on: Nov 08, 2024 | 12:30 PM

మేడ్చల్‌, నవంబర్‌ 8: తెలంగాణ గ్రూప్‌ 3 పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు మరో రెండు రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. నవంబర్ 10 నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక గ్రూప్‌ 3 పరీక్షలు ఈ నెల 17, 18వ తేదీలలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాదాపు 65,361 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ఈ పరీక్షలు రెండు సెషన్లలో ఉంటాయని నవంబర్‌ 17న పేపర్‌-1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్‌ 2 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుందని తెలిపారు.

ఇక నవంబర్‌ 18న పేపర్‌ 3 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇలా మొత్తం 3 పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. గ్రూప్‌ 3 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుంచి కమిషన్‌ వెబ్‌సైట్‌  నుంచి హాల్‌ టిక్కెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కలెక్టర్‌ సూచించారు. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే TGPSC టెక్నికల్‌ హెల్ప్‌ డెస్క్‌ ఫోన్‌ నంబర్‌ 040-2354 2185 లేదా 040-2354 2187 సంప్రదించాలని లేదా HELPDESK@TSPSC.GOV.IN కు ఇమెయిల్‌ చేయవచ్చని సూచించారు.

ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పెంపు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సులన్నింటికీ పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగించినట్లు వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ రాములు ఓ ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్‌, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్‌, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర అన్ని కోర్సుల మొదటి సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షా ఫీజును నవంబర్‌ 14వ తేదీలోగా సంబంధిత కాలేజీల్లో చెల్లించాలని సూచించారు. రూ.500 అపరాధ రుసుముతో నవంబర్‌ 18వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. డిగ్రీ పరీక్షలు వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీలతో కూడిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ అధికారిక వెబ్‌సైట్‌ లో చూసుకోవచ్చని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..