చాలా మంది భోజనం చేసిన వెంటనే మంచం మీద పడుకుంటారు. పడుకున్నప్పుడు కడుపులోని ఆమ్లం వెనుకకు, పైకి కదులుతుంది. తిన్న వెంటనే పడుకునే అలవాటు వల్ల కడుపు నొప్పి, తిమ్మిర్లు వస్తాయి. అలాగే కొంతమంది అతిగా తింటారు. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. అలాగే పేలవమైన జీర్ణక్రియ కడుపు నొప్పికి కారణం కావచ్చు. కాబట్టి నెమ్మదిగా జీర్ణమయ్యే, అసిడిక్ ఫుడ్, బ్రెడ్, స్పైసీ ఫుడ్ జీర్ణమవడం కష్టమైన ఆహారాన్ని వీలైనంత తగ్గించడం మంచిది.