AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘పాపం.. బాగా హర్ట్‌ అయినట్టున్నాడు’ భార్య ముందు ‘అంకుల్‌’ అన్నందుకు షాప్‌ ఓనర్‌ను చితక్కొట్టిన కస్టమర్! వీడియో

కొంత మంది తమ వయసును దాచేందుకు నానాతంటాలు పడుతుంటారు. ఇంత చేసినా పుసుక్కున కొంతమంది అంకుల్ అనో.. అంటీ అనో.. పిలుస్తుంటారు. దీంతో వయసు దాయడంలో విఫలమైన ముదురు బెండకాయలు తెగ ఫీలైపోతుంటారు. అంతటితో ఆగితో ఏ ఇబ్బంది లేదు. కానీ ఓ అతడను మాత్రం అంతకు మించి అనేలా తనను 'అంకుల్' అన్న వ్యక్తిని పిచ్చకొట్టుడు కొట్టి నానాయాగి చేశాడు.. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది..

Viral Video: 'పాపం.. బాగా హర్ట్‌ అయినట్టున్నాడు' భార్య ముందు ‘అంకుల్‌’ అన్నందుకు షాప్‌ ఓనర్‌ను చితక్కొట్టిన కస్టమర్! వీడియో
Man Assaults Shopkeeper For Calling Him Uncle
Srilakshmi C
|

Updated on: Nov 07, 2024 | 10:16 AM

Share

భోపాల్‌, నవంబర్‌ 7: భార్యకు చీర కొనేందుకు కుటంబుంతో చీరల షాపుకు వెళ్లాడో పెద్దమనిషి. అయితే అక్కడ చీరలు చూపిస్తున్న షాప్‌ ఓనర్ పుసుక్కున అతగాడిని ‘అంకుల్‌’ అని పిలిచాడు. దీంతో భార్య ముందే తనను అంకుల్‌ అని పిలుస్తాడా? అని సదరు పెద్ద మనిషి తెగ ఫీలైపోయాడు. అంతే భార్య, పిల్లలను తీసుకుని షాప్‌ నుంచి విసవిసా వెళ్లిపోయాడు. కాసేపటికే ఓ గ్యాంగ్‌ను ఏసుకొచ్చి షాప్‌ ఓనర్‌ను చితక్కొట్టాడు. మధ్యప్రదేశ్ రాజధాని జట్‌ఖేడీ ప్రాంతంలో ఉన్న విశాల్ శాస్త్రి చీరల దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అసలేం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని జాత్‌ఖేడి ప్రాంతంలో విశాల్‌కు చీరల షాపు ఉంది. శనివారం రోహిత్‌ అనే కస్టమర్‌ తన భార్యతో కలిసి ఆ షాప్‌కి వచ్చాడు. ఈ జంట పలు చీరలను చూసింది. అయితే కొనుగోలు చేసేందుకు ఏ చీరను ఎంచుకోలేదు. అసలు వారికి ఏ ధరలో చీరలు కావాలి అని విశాల్‌ అడిగాడు. వెయ్యి అని రోహిత్‌ సమాధానమిచ్చాడు. అయితే అంతకంటే ఖరీదైన చీర కూడా కొనగలనని, తన కొనుగోలు సామర్థ్యాన్ని తక్కువగా భావించి మాట్లాడవద్దని హెచ్చరించాడు. దీంతో ‘అంకుల్‌’ మీకు ఆ రేంజ్‌లో కూడా చీరలు చూపిస్తాను’ అని విశాల్‌ అన్నాడు. దీనికి ఆగ్రహించిన రోహిత్‌ తనను ‘అంకుల్‌’ అని పిలుస్తావా అంటూ విశాల్‌పై విరుచుకుపడ్డాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత భార్యతో కలిసి రోహిత్‌ షాపు నుంచి వెళ్లిపోయాడు.

ఇవి కూడా చదవండి

అయితే కాసేపటికే రోహిత్‌ తిరిగిరావడం చూసి విశాల్‌ కంగారుపడ్డాడు. రోహిత్‌తోపాటు అతని వెనుక మరి కొంత మందితో కలిసి ఆ చీరల షాపు వద్దకు వచ్చాడు. వారంతా కలిసి విశాల్‌ను షాప్‌ నుంచి రోడ్డు వద్దకు లాక్కెళ్లి కర్రలు, బెల్టుతో చావగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన విశాల్‌ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు రోహిత్‌, అతడి అనుచరులపై కేసు నమోదు చేసి, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని సీనియర్ పోలీసు అధికారి మనీష్ రాజ్ సింగ్ భదౌరియా మీడియాకు తెలిపారు. ఆ షాపు వద్ద ఉన్న సీసీటీవీలో సంఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో క్లిప్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.