AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leave Letter: మూడు ముక్కల్లో బాస్‌కి లీవ్‌ రిక్వెస్ట్ పంపిన ఉద్యోగి.. జుట్టు పీక్కున్న బాస్

యాజమన్యాన్ని లీవ్ కోరాలంటే సాధారణంగా ఉద్యోగులు ఈమెయిల్ పెడుతుంటారు. అందుకు ఓ ఫార్మాట్ ఫాలో అవుతారు. కానీ ఇతగాడికి బద్ధకమో.. లేదా చెప్పాలనుకుంది సూటిగా చెప్పేస్తో పోలా.. అని అనుకున్నాడో తెలియదు గానీ. ఈ మెయిల్ అయితే పంపాడు. కానీ అందులో రెండు, మూడు పదాలు మాత్రమే ఉన్నాయి..

Leave Letter: మూడు ముక్కల్లో బాస్‌కి లీవ్‌ రిక్వెస్ట్ పంపిన ఉద్యోగి.. జుట్టు పీక్కున్న బాస్
Gen Z Employee Leave Letter
Srilakshmi C
|

Updated on: Nov 07, 2024 | 12:09 PM

Share

జనరేషన్‌ జెడ్ (Gen Z) ఉద్యోగి ఒకరు తన బాస్‌కి లీవ్‌ రిక్వెస్ట్ కోరుతూ పంపిన ఇమెయిల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాతో తీవ్ర చర్చకు దారి తీసింది. అందరూ దీని స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. తప్పొప్పులపై తెగ చర్చించుకుంటున్నారు. ప్రముఖ ఇన్వెస్టర్‌ సిద్ధార్థ్ షా ఇందుకు సంబంధించిన ఫొటోను ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తూ.. ‘నా Gen Z టీం ఈ లీవ్‌ను ఎలా ఆమోదించింది’ అంటూ ఓ క్యాప్షన్ కూడా జోడించాడు.

సాధారణంగా కంపెనీ ఉద్యోగులకు లీవ్‌ కోరుతూ యాజమన్యానికి మెయిల్‌ పెడుతుంటారు. ఇందులో ఒక ప్రత్యేక ఫార్మట్‌ ఉద్యోగులు అందరూ ఫాలో అవుతారు. అయితే నేటి యువత ఈ సంప్రదాయ పద్ధతులకు నీళ్లొదిలేసి మరింత సరళమైన విధానాన్ని ఎంచుకుంటున్నారు. తాము చెప్పదల్చుకున్న విషయాన్ని క్లుప్తంగా, సూటిగా, అసంబద్ధంగా తమ లీవ్‌ రిక్వెస్ట్‌లో రెండు ముక్కల్లో తేల్చేస్తున్నారు. తాజాగా సిద్ధార్ధ్‌ షాకు కూడా అతని కంపెనీలో ఉద్యోగి చాలా క్లుప్తంగా మూడే ముక్కల్లో లీవ్‌ రిక్వెస్ట్ కోరుతూ ఈమెయిల్ పెట్టాడు. అందులో ‘హాయ్ సిద్ధార్థ్. నవంబర్ 8, 2024న నేను సెలవు తీసుకుంటున్నాను. బై..’ అని లీవ్‌ లెటర్‌ రాసి బాస్‌కి సెండ్ చేశాడు. ఇక సదరు షార్ట్‌ లీవ్‌ లెటర్‌ చూసిన బాస్‌కి దాదాపు దిమ్మతిరిగినట్లైంది. దీంతో అతగాడు దానిని స్క్రీన్‌ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. ఇక ఈ పోస్టును అలా పోస్టు చేయగానే.. ఇలా కేవలం ఒక రోజు వ్యవధిలోనే ఏకంగా 1.2 మిలియన్లకుపైగా వీక్షణలు, వందల కొద్దీ కామెంట్లు రావడంతో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

‘నేను గనుక ఇదే మెసేజ్‌ను మా మేనేజర్‌కు పంపినట్లయితే, వెంటనే నా బిహేవియర్‌పై చర్చించడానికి HRతో మీటింగ్‌ షెడ్యూల్‌ చేసేవాడు’, ‘ఇదేమంత తప్పుకాదు. లీవ్‌ రిక్వెస్ట్‌పై అవగాహన కల్పించడం యాజమన్యం బాధ్యంత. దానిపై ఇతరుల చర్చ అనవసరం’, చాలా కంపెనీలు లీవ్‌ రిక్వెస్ట్‌ను తిరస్కరించవు. అయితే ఇది ఉద్యోగం, టీం సైజ్, నైపుణ్యం సెట్‌పై ఆధారపడి ఉంటుంది. లీవ్‌ తీసుకోవడం ప్రతిఒక్కరి ప్రాథమిక హక్కు’ అంటూ నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మీరే గనుక మీ బాస్‌కి ఇలాంటి మూడు ముక్కల లీవ్‌ లెటర్‌ పెడితే ఏం జరుగుతుందో..? ఓసారి ఊహించడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.