AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బస్సు నడుపుతుండగా గుండెపోటుతో కుప్పకూలిన డ్రైవర్.. ఆ తర్వాత రొమాలు నిక్కబొడిచే సీన్

ఆ బస్సులో దాదాపు 50 ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఓ మాదిరి స్పీడ్‌తో వెళ్తోంది. ఇంతలోనే హఠాత్ పరిణామం. స్టీరింగ్ పట్టుకొని ఉన్న డ్రైవర్‌ ఆ సీటులోనే కుప్పకూలిపోయాడు. అంతే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసినట్లైంది. అక్కడే తన సమయస్పూర్తి చూపాడు కండక్టర్. స్టీరింగ్‌ తీసుకొని బస్సును నిలిపేశాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. కండక్టర్ సమయస్ఫూర్తి చూపాడు. లేదంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది.

Viral Video: బస్సు నడుపుతుండగా గుండెపోటుతో కుప్పకూలిన డ్రైవర్.. ఆ తర్వాత రొమాలు నిక్కబొడిచే సీన్
Bengaluru Bus Driver
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 07, 2024 | 11:54 AM

ఆ బస్సులో దాదాపు 50 మంది ఎక్కారు. తమ గమ్య స్థానానికి చేరుకునేందుకు అంతా సిద్ధమై కూర్చున్నారు. బస్సు ఓ మాదిరి స్పీడ్‌తో వెళ్తోంది. ఇంతలోనే ఊహించని పరిణామం ఎదురైంది. స్టీరింగ్ తిప్పుతున్న డ్రైవర్‌ ఒక్కసారిగా తన సీటులో కుప్పకూలిపోయాడు. బస్సు అదుపు తప్పుతోంది. ప్రయాణికుల్లో అలజడి.. కేకలు వేస్తున్నారు. వెంటనే అలర్టయ్యాడు కండక్టర్‌.. స్టీరింగ్‌ తన చేతిలోకి తీసుకున్నాడు. సురక్షితంగా బస్సును పక్కకు ఆపాడు. దీంతో బస్సులోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ డ్రైవర్‌ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ డిపో 40లో కిరణ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బస్సు నేలమంగళ నుంచి యశ్వంత్‌పూర్‌కు వస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై డ్రైవింగ్‌ సీట్లోనే కిరణ్ స్పృహతప్పి పడిపోయాడు. బస్సులోని సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. డ్రైవర్ కుప్పకూలడంతో బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న బస్సును రాసుకుంటూ వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన బస్సులోని కండక్టర్ డ్రైవర్‌ను లేపే ప్రయత్నం చేస్తూనే డ్రైవింగ్ సీట్లోకి వెళ్లి బస్సును సురక్షితంగా నిలిపివేశాడు. ఆ తర్వాత డ్రైవర్ కిరణ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బస్సును నిలిపివేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కండక్టర్‌ను కర్నాటక ఆర్టీసీ అధికారులు ప్రశంసించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.