TG TET 2024 Application: టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌ అప్లికేషన్ ప్రక్రియ ప్రాంరంభం! భారీగా తగ్గిన దరఖాస్తు ఫీజు

ఎట్టకేలకు తెలంగాణ టెట్ 2024 ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం అర్ధరాత్రి నుంచి దరఖాస్తులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వివరణాత్మక నోటిఫికేషన్ కూడా విద్యాశాఖ విడుదల చేసింది..

TG TET 2024 Application: టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌ అప్లికేషన్ ప్రక్రియ ప్రాంరంభం! భారీగా తగ్గిన దరఖాస్తు ఫీజు
TG TET 2024 Application
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 08, 2024 | 10:43 AM

హైదరాబాద్, నవంబర్‌ 8: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2024) 2024 దరఖాస్తుల ప్రక్రియ నవంబర్‌ 7 (గురువారం) రాత్రి 11 నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు టెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు విద్యాశాఖ తెలిపింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు నవంబర్‌ 5వ తేదీ నుంచే టెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యల కారణంగా 2 రోజులు ఆలస్యమైంది. 7వ తేదీ నుంచి టెట్‌ వెబ్‌సైట్‌ అందుబాటులోకి తెస్తామని,అభ్యర్థులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు టెట్ అభ్యర్థులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. గత మేలో నిర్వహించిన టెట్‎కు దరఖాస్తు చేసుకున్నోళ్లందరూ వచ్చే జనవరిలో నిర్వహించనున్న టెట్ పరీక్షకు ఎలాంటి ఫీజు లేకుండానే ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చని అప్పట్లో సీఎం రేవంత్‌ ప్రకటించారు. దీంతో తాజా టెట్‌కు వీరందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అంతేకాకుండా టెట్‌ దరఖాస్తు ఫీజును కూడా భారీగా తగ్గించింది.

గతంలో ఒక పేపర్‎కు రూ.1000, రెండు పేపర్లు రాస్తే రూ.2 వేల ఫీజు చెల్లించవల్సి వచ్చేది. ప్రస్తుతం దాన్ని రూ.750కి కుదించారు. అంటే ఒక పేపర్‌ రాసేవారు రూ.750 చెల్లించాలి. రెండు పేపర్లు రాసేవారికి రూ.వెయ్యిగా నిర్ణయించింది. ఈ మేరకు టెట్ డిటెయిల్డ్ నోటిఫికేషన్‌ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, టెట్ కన్వీనర్ రమేశ్ గురువారం విడుదల చేశారు. మేలో నిర్వహించిన టెట్‌లో క్వాలిఫై అయినా, కాకపోయినా అప్లై చేసుకునే వారు వచ్చే జనవరిలో జరిగే టెట్‌కు ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో ప్రకటించారు. టెట్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 7 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఫీజు చెల్లించి, అధికారిక వెబ్‌సైట్లో అప్లై చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

డిసెంబర్ 26 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష రోజుకు రెండు సెషన్లలో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్ష ఉంటుంది. ఇక టెట్‌ 2024 ఫలితాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ప్రకటిస్తారు. మొత్తం 8 భాషల్లో టెట్‌ పరీక్ష జరగనుంది. తెలుగుతోపాటు ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్, గుజరాతీ భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఐదో తరగతి వరకు బోధించే వారు పేపర్ 1, ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే వారు పేపర్​2కు అప్లై చేసుకోవచ్చు. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కల్పించారు. టెట్ మొత్తం 150 మార్కులకు ఉంటుంది. క్వాలిఫై మార్కులు.. జనరల్ కేటగిరీకి 60%, బీసీ కేటగిరీకి 50%, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీకి 40%గా విద్యాశాఖ నిర్ణయించింది. ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చు. టెట్ ఆఫీస్: 70750 88812 / 70750 28881, వెబ్ సైట్ రిలేటెడ్: 70750 28882/ 70750 28885, టెక్నికల్ రిలేటెడ్: 70329 01383/ 90007 56178 నంబర్లకు పని వేళల్లో ఫోన్‌ చేసి సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి

టెట్ 2024 నవంబర్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.