Telangana: ఓ ఉపాధ్యాయుడి మరణానికి కారణం అయిన కోతి.. ఎక్కడంటే

విధులకు వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోవడానికి ఓ కోతి కారణం అయ్యింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. తెలంగాణాలోని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన పర్పటకం ధర్మారెడ్డి అదే మండలంలోని చూంచన కోట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

Telangana: ఓ ఉపాధ్యాయుడి మరణానికి కారణం అయిన కోతి.. ఎక్కడంటే
Govt Teacher Dead In Road Accident
Follow us
P Shivteja

| Edited By: Surya Kala

Updated on: Nov 08, 2024 | 10:46 AM

రోజులానే గురువారం ఉదయం ఇంటి నుంచి హెల్మెట్ ధరించి స్కూటీపై స్కూల్ కి బయలుదేరాడు. రోడ్డు మీద అడ్డంగా వచ్చిన కోతిని తప్పించబోయి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చూంచనకోట శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మండలంలోని వేచరేణి గ్రామానికి చెందిన పర్పటకం ధర్మారెడ్డి అదే మండలంలోని చూంచన కోట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఎప్పటిలా ఈ రోజు కూడా స్కూల్ కి తన స్కూటర్ పై వెళ్తున్నాడు. చూంచనకోట శివారులో ఆ ఉపాధ్యాయుడి తన స్కూటిపై చేరుకున్నాడు. అప్పుడే అటుగా వెళుతున్న ఓ కోతి స్కూటికి అడ్డుగా వచ్చింది. దాన్ని తప్పించబోయినప్పటికి కోతి కంగారులో స్కూటి మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో ఆయన స్కూటితో పాటు కిందపడ్డాడు. దీంతో ఉపాధ్యాయుడుకి తీవ్రం గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

హెల్మెట్ ధరించిన ఉపాధ్యాయుని ప్రాణం కాపాడలేకపోయింది. విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద ఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెల్పిన వివరాల ప్రకారం.. వేచరేని గ్రామానికి చెందిన వ్యక్తీ విధి నిర్వహణలో భాగంగా స్కూటీపై చుంచనకోట వైపు వెళ్తుండగా మార్గమధ్యమంలో కోతి అడ్డం వచ్చింది. స్కూటీ ముందు భాగంలో కోతి ఇర్రుక్కు పోవడంతో స్కూటీపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే