Telangana: ఇంటి ముందు మురికి కాల్వలో కదులుతున్న భారీ ఆకారం.. తీరా చూస్తే..!

రాజీవ్ నగర్ కాలనీలో గురువారం(నవంబర్ 7) రాత్రి సమయంలో ఓ భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. అయితే పక్కనే కొండలు ఉండటంతో అక్కడి నుంచి వచ్చిందని స్థానికులు భావిస్తున్నారు.

Telangana: ఇంటి ముందు మురికి కాల్వలో కదులుతున్న భారీ ఆకారం.. తీరా చూస్తే..!
Python
Follow us
G Sampath Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Nov 08, 2024 | 12:32 PM

కొండచిలువ సంచారం తో స్థానికులు హడలిపోయారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. ఇళ్ల మధ్య సంచరించింది ఓ భారీ కొండచిలువ. ఒక్కసారిగా కనిపించడంతో స్థానికులు భయం పరుగులు తీశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది.

రాజీవ్ నగర్ కాలనీలో గురువారం(నవంబర్ 7) రాత్రి సమయంలో ఓ భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. అయితే పక్కనే కొండలు ఉండటంతో అక్కడి నుంచి వచ్చిందని స్థానికులు భావిస్తున్నారు. కాలనీలోని మురికి కాలువ నుండి పరుగులు తీసింది. సుమారుగా ఆరు ఫీట్ల వరకు పొడవు ఉన్న కొండచిలువ ఇళ్ల మధ్య కనిపించడంతో జనం భయాందోళనలు వ్యక్తం చేశారు. దీంతో స్థానికులు పెద్ద సంఖ్య లో గుమికూడి.. వెళ్లగొట్టేందుకు ప్రయత్నం చేశారు. కానీ బయటకు రాలేదు.

గంట పాటు కాలనీలో కొండచిలువ సంచరించింది. ఆ తరువాత స్థానికులు స్నేక్ క్యాచర్ కి‌ సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ కొండచిలువను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే..కొండచిలువ పెద్దగా ఉండటంతో అతి కష్టం మీద పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఇక్కడ వీధి దీపాలు సరిగా లేకపోవడంతో ఇలాంటి పాములు, జంతువులు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం బయటకు రాలేక పోతున్నామని చెబుతున్నారు. కరీంనగర్ శివారు కాలనీలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గతంలో ఈ ప్రాంతం లో ఎలుగుబంట్లు సంచరించాయి. నిత్యం ఇక్కడ పాములు కనబడుతున్నాయి. శివారు ప్రాంతం కావడంతో.. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ