Hanuman Puja Tips: హనుమంతుడి అనుగ్రహం కోసం మంగళవారం ఆలయంలో ఇవి సమర్పించండి.. అనుగ్రహం పొందండి..

హిందూ విశ్వాసం ప్రకారం.. మంగళవారం నాడు ఆరాధించడం ద్వారా..హనుమంతుడు త్వరగా  సంతోషిస్తాడు. తన భక్తులు కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు. హనుమంతుడ్ని పూజించిన భక్తుడు జీవితంలో ఎటువంటి భయం ఉండదు.

Hanuman Puja Tips: హనుమంతుడి అనుగ్రహం కోసం మంగళవారం  ఆలయంలో ఇవి సమర్పించండి.. అనుగ్రహం పొందండి..
శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం సూర్యాస్తమయం తర్వాత హనుమంతుడిని పూజించండి. హనుమంతదేవుని పూజలో దీపం వెలిగించవచ్చు. అయితే ఆ దీపంలో నల్ల నువ్వుల నూనె ఉపయోగించండి.
Follow us

|

Updated on: May 09, 2023 | 12:32 PM

సనాతన సంప్రదాయంలో శ్రీరామునికి అత్యంత భక్తుడైన హనుమంతుడి గురించి ఒక నమ్మకం ఉంది. ప్రతి యుగంలో భూమిపై ఉన్నాడని.. ఎవరైనా తనను హృదయపూర్వకంగా పూజిస్తే వారికోసం పరిగెత్తుకుంటూ వస్తాడని విశ్వాసం. చిరంజీవిగా భావించే హనుమంతుని ఆరాధనకు మంగళవారం శుభ ఫలితాలను ఇస్తుందని భావిస్తారు. మంగళవారం నాడు హనుమంతుడిని పూజించే భక్తుల కోరికలు రెప్పపాటులో  నెరవేరుతాయని విశ్వాసం.

హిందూ విశ్వాసం ప్రకారం.. మంగళవారం నాడు ఆరాధించడం ద్వారా..హనుమంతుడు త్వరగా  సంతోషిస్తాడు. తన భక్తులు కోరిన వరాన్ని ప్రసాదిస్తాడు. హనుమంతుడ్ని పూజించిన భక్తుడు జీవితంలో ఎటువంటి భయం ఉండదు. ఎందుకంటే హనుమంతుడు ప్రతి క్షణం అతన్ని రక్షిస్తాడు. ఈ రోజు మనం మంగళవారం రోజున భజరంగి బలిని పూజించే గొప్ప పరిహారం గురించి తెలుసుకుందాం.

ఆంజనేయ స్వామి ఆరాధన నియమాలు ప్రాముఖ్యత 

ఇవి కూడా చదవండి
  1. హనుమంతుని ఆరాధనలో దిక్కులకు చాలా ప్రాముఖ్యత ఉంది. సనాతన సంప్రదాయంలో  దక్షిణ ముఖంగా ఉండే దేవుడిని పూజించడం అశుభమైనదిగా పరిగణించబడుతుంది. అయితే బజరంగి బలిని  పూజించడానికి అన్ని దిశలు ఉపయోక్తమే.. భక్తులను కష్టాల నుండి రక్షిస్తాడని హిందువుల విశ్వాసం. అంతేకాదు హనుమంతుడు దక్షిణ దిశలో అంటే లంకకు వెళ్లడం ద్వారా తన శక్తులను గరిష్టంగా చూపించాడు. కనుక మంగళవారం రోజున హనుమంతుడిని దక్షిణాభిముఖంగా పూజిస్తే.. ఎటువంటి  సంక్షోభమైన అధిగమించవచ్చు.
  2. హిందూ విశ్వాసం ప్రకారం, భగవంతుడు ఎక్కడ శ్రీరాముని స్తుతిస్తాడో.. అక్కడ హనుమంతుడు ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. అటువంటి పరిస్థితిలో.. హనుమంతుడి ఆశీర్వాదం పొందడానికి.. ఆరాధనతో పాటు, శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేయండి. శ్రీ రామచరిత్ మానస్ ను లేదా సుందరకాండను పఠించండి.
  3. హనుమంతుడు ఆనందం, శ్రేయస్సు , అదృష్టం కలిగేలా ఆశీర్వాదం పొందేలా మంగళవారం పూజలో  తమలపాకును సమర్పించండి. హిందూ విశ్వాసం ప్రకారం తమలపాకును సమర్పిస్తే.. అతని జీవితంలో సుఖ సంతోషాలను ఇస్తాడు. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఎల్లప్పుడూ ఆనందం , సంపద లభిస్తుంది.
  4. హనుమంతుని ఆరాధనలో సింధూరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అటువంటి పరిస్థితిలో మంగళవారం ఆంజనేయ స్వామి ఆశీర్వాదం పొందడానికి.. సింధూరం సమర్పించండి. అంతేకాదు నువ్వుల నూనె కూడా  సమర్పించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).