AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2024: వినాయక చవితికి కావాల్సిన సామాన్ల లిస్ట్ ఇదే.. గాబరా పడకండి..

హిందువులు ఎంతో ఘనంగా నిర్వహించుకునే పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి వచ్చిందంటే.. వీధులు, వాడలు అన్నీ గణేష్ మండపాలతో నిండిపోతుంది. బొజ్జ గణపయ్యతో నగరాలన్నీ కళకళలాడుతూ ఉంటాయి. వినాయకుడి పండుగ కోసం యువత ఏడాది అంతా ఎదురు చూస్తుంది. 'గణపతి బప్పా మోరియా' అనే నామ స్మరణతో అంటూ నగరాలు మారుమోగిపోతాయి. ఏ పండుగ వచ్చినా.. ఇంట్లో ఆడవాళ్లు పడే హైరానా అంతా ఇంతా కాదు. ఇంట్లో వాళ్లు సపోర్ట్..

Ganesh Chaturthi 2024: వినాయక చవితికి కావాల్సిన సామాన్ల లిస్ట్ ఇదే.. గాబరా పడకండి..
Ganesh Chaturthi 2024 4
Chinni Enni
|

Updated on: Sep 06, 2024 | 1:57 PM

Share

హిందువులు ఎంతో ఘనంగా నిర్వహించుకునే పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. వినాయక చవితి వచ్చిందంటే.. వీధులు, వాడలు అన్నీ గణేష్ మండపాలతో నిండిపోతుంది. బొజ్జ గణపయ్యతో నగరాలన్నీ కళకళలాడుతూ ఉంటాయి. వినాయకుడి పండుగ కోసం యువత ఏడాది అంతా ఎదురు చూస్తుంది. ‘గణపతి బప్పా మోరియా’ అనే నామ స్మరణతో అంటూ నగరాలు మారుమోగిపోతాయి. ఏ పండుగ వచ్చినా.. ఇంట్లో ఆడవాళ్లు పడే హైరానా అంతా ఇంతా కాదు. ఇంట్లో వాళ్లు సపోర్ట్ చేసినా చేయకపోయినా.. వంటలు, ఇంటి అలంకరణలో హడావిడిగా ఉంటారు. ఎన్ని తీసుకొచ్చినా.. ఏం చేసినా ఇంకా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటారు. ఎప్పుడు చేసినా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం. కానీ మీకు ఆ సమస్య లేకుండా లిస్ట్ తీసుకొచ్చాం. పూజకు కావాల్సిన లిస్ట్ మొత్తం సిద్ధంగా ఉంచాం. జస్ట్ ఈ లిస్ట్ చూసి అన్నీ తెచ్చుకుంటే సరిపోతుంది. మరి అవేంటో చూసేయండి.

వినాయక చవితి పూజకు కావాల్సిన సామాగ్రి:

పసుపు, కుంకుమ, అగరువత్తులు, కర్పూరం, గంధం, బియ్యం పిండి, పెసర పప్పు, బెల్లం, అక్షింతలు, అరటి పండ్లు (ఇంకా మీ స్థోమతకు దగ్గ ఇతర పండ్లు కొనుక్కోవచ్చు), కొబ్బరి కాయలు, పత్రి, తమలపాకులు, వక్కలు, పూలు, పూల దండలు, తోరము, దీపారాధనకు వత్తులు, నెయ్యి, వినాయకుడి ప్రతిమ, పత్రి, గరిక, నైవేద్యాలు.

పత్రి రకాలు:

వినాయకుడికి పూజ చేయాలంటే ముందుగా పత్రి చాలా అవసరం. వీలైతే 21 రకాల పత్రి ఆకులు సేకరించండి. లేదంటే పత్రిని తలుచుకుంటూ గరికతో పూజ చేయించండి. మరి ఆ పత్రి రకాలు ఏంటో చూసేయండి. రేగు ఆకు, మారేకు ఆకు, గరిక, ఉమ్మెత్త, బృహతీ పత్రం, చీ పత్రం, తులసి, మామిడి ఆకు, గన్నేు, ఉత్తరేణి, విష్ణుక్రాంత, దానిమ్మ, దేవదారు, మరువం, సింధేవాన, సన్న జాజి, లతా దుర్వా, శమీ పత్రం, రావి, మత్తి చెట్టు ఆకు, జిల్లేడు.

ఇవి కూడా చదవండి

ఏ సమయంలో పూజించాలి:

ధృక్ పంచాంగం ప్రకారం వినాయక వ్రతము చేసుకోవడానికి మంచి శుభ ముహూర్తాలు ఉన్నాయి. శనివారం ఉదయం 11:03 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట సమయం వరకు వినాయక చవితి పూజ చేసుకోవచ్చు. సాయంత్రం 6:22 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల మధ్యలో పూజ చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి. అలాగే ఎరుపు రంగు దుస్తులు లేదా నీలం రంగు దుస్తులు ధరించి పూజలు చేస్తే మరింత అదృష్టం కలిసి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు.

అలాగే వినాయక చవితి రోజు.. కొబ్బరి నూనె వేసి జిల్లేడు వత్తులతో దీపం పెట్టడం పెట్టడం వల్ల మరింత విశేషంగా కలిసి వస్తుందట. వినాయకుడికి ఇదే రోజు గరికతో తయారు చేసిన మాల వేస్తే చాలా మంచిదని, ఆర్థిక కష్టాలు తొలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)