Vinayaka Chavithi 2024: వినాయక ప్రతిష్టకు ముందు ఈ పని చేయండి.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది..

హిందూ మతంలో ఏదైనా శుభ కార్యం ప్రారంభంలో ముందుగా గణేశుడిని ఆరాధిస్తారు. ప్రత్యేక నియమ నిష్టలతో పూజ చేస్తారు. గృహ ప్రవేశం సమయంలో గణేశుడిని పూజించడం, ఇంటిని నిర్మించే ముందు భూమి పూజ, వాహన పూజ, వివాహం లేదా ఏదైనా ప్రత్యేక పూజ చేయడం కూడా ఆచారం. తొలి వివాహ ఆహ్వాన పత్రం కూడా వినాయకుడికి అందిస్తారు. ఇక ఏదైనా ఆహ్వానం పత్రికలో గణపతిని ధ్యానిస్తూ శ్రీరస్తు, శుభమస్తు అవిఘ్నమస్తు అని మొదలు పెడతారు.

Vinayaka Chavithi 2024: వినాయక ప్రతిష్టకు ముందు ఈ పని చేయండి.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది..
Vinayaka Chavithi 2024
Follow us

|

Updated on: Sep 06, 2024 | 2:19 PM

హిందూ మతంలో పూజల్లోనైనా, శుభకార్యాలు, పెళ్లి ఇలా ఏ సందర్భంలోనైనా చేపట్టిన పనిలో ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపోవాలంటే ముందుగా వినాయకుడిని పూజిస్తారు. విఘ్నాలధిపతి వినాయకుడిని పూజించి లేదా ప్రార్ధించి మొదలు పెట్టిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని విశ్వాసం. గణపతికి అన్కెఅ పేర్లు. తండ్రి శివయ్య మాదిరిగానే చిన్న చిన్న పూజలకే కోరిన కోర్కెలు తీర్చే దైవం. హిందూ పంచాంగం ప్రకారం వినాయకుడి జన్మ దినోత్సవం భద్రప్రద మాసం శుక్లపక్షం చవితి తిది. ఈ రోజున వినాయక చవితిగా భక్తులు ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండగ జరుపుకోవడానికి భక్తులు రెడీ అవుతున్నారు. ఈ ఉత్సవాలు పది రోజుల పాటు సాగనున్నాయి.

హిందూ మతంలో ఏదైనా శుభ కార్యం ప్రారంభంలో ముందుగా గణేశుడిని ఆరాధిస్తారు. ప్రత్యేక నియమ నిష్టలతో పూజ చేస్తారు. గృహ ప్రవేశం సమయంలో గణేశుడిని పూజించడం, ఇంటిని నిర్మించే ముందు భూమి పూజ, వాహన పూజ, వివాహం లేదా ఏదైనా ప్రత్యేక పూజ చేయడం కూడా ఆచారం. తొలి వివాహ ఆహ్వాన పత్రం కూడా వినాయకుడికి అందిస్తారు. ఇక ఏదైనా ఆహ్వానం పత్రికలో గణపతిని ధ్యానిస్తూ శ్రీరస్తు, శుభమస్తు అవిఘ్నమస్తు అని మొదలు పెడతారు. చాలా మంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తే గణపతికి తొలి పూజ చేసి అనంతరం ఆ కొత్త వస్తువులను ఉపయోగించడం ప్రారంభిస్తారు. భారతీయ సంస్కృతిలో ఈ ఆచారం యుగయుగాలుగా కొనసాగుతున్నది. కొత్త వస్తువు కొని ఇంటికి తెచ్చినప్పుడు మొదట దీపం వెలిగించి పసుపుతో స్వస్తిక్ చిహ్నం వేస్తారు. దానికి కుంకుమ చందనం తో అలంకరిస్తారు.

మంగళకరమైన పనులు లేదా పూజలలో గణేశుడిని మొదట పూజించినట్లే హిందూ మతంలో శుభకార్యాలు ప్రారంభించే ముందు స్వస్తిక చిహ్నాన్ని వేస్తారు. వివాహ ఆహ్వానాలపైన మాత్రమే కాదు ఎటువంటి శుభకార్యానికి సంబంధించిన పత్రికలైనా స్వస్తిక చిహ్నంతోనే మొదలు పెడతారు. ఇక ఇంటి ప్రధాన ముఖద్వారం పైన ,పూజ ప్లేట్లు, తమలపాకులపై గణేశుని చిహ్నమైన స్వస్తిక్ ని వేసి అప్పుడు పనులు మొదలు పెడతారు. ఈ గుర్తు శుభాన్ని సూచించడమే కాకుండా ఇంటికి సానుకూల శక్తిని కూడా తెస్తుందని నమ్మకం.

ఇవి కూడా చదవండి

వినాయకుని చిహ్నం స్వస్తిక్ ఎందుకంటే

స్వస్తిక్ భగవానుడు శ్రీ గణేశుని చిహ్నంగా పరిగణించబడుతుంది. స్వస్తిక్ కు ఉండే నాలుగు గీతలు గణేశుడి నాలుగు చేతులకు ప్రతీకగా నమ్ముతారు. స్వస్తిక నాలుగు గీతలు నాలుగు ధర్మాలకు ప్రతీక. ధర్మము, అర్థము, కామము, మోక్షములైతే.. స్వస్తిక్ లోని రెండు రేఖలు గణేశుని ఇద్దరు భార్యలు సిద్ధి, బుద్దిలను సూచిస్తాయి. మరో రెండు పంక్తులు గణపతి ఇద్దరు కుమారులు యోగ, క్షేమలను సూచిస్తాయి. ఈ పవిత్రమైన స్వస్తిక్ స్వస్తిక చిహ్నాన్ని గణేశుడి కుటుంబానికి ప్రతీకగా భావిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

వినాయకుడిని ఇంట్లోకి తీసుకొచ్చే ముందు ఈ సింబల్ ఎందుకు వేస్తారంటే
వినాయకుడిని ఇంట్లోకి తీసుకొచ్చే ముందు ఈ సింబల్ ఎందుకు వేస్తారంటే
12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలే నిద్రపోతున్న వ్యక్తి..
12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలే నిద్రపోతున్న వ్యక్తి..
మొలకెత్తిన రాగులను తింటే గుండె పదిలం..! బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
మొలకెత్తిన రాగులను తింటే గుండె పదిలం..! బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
మోక్షజ్ఞ ఎంట్రీ ఈ దర్శకుడి సినిమాతోనేనా ??
మోక్షజ్ఞ ఎంట్రీ ఈ దర్శకుడి సినిమాతోనేనా ??
గుడ్‌న్యూస్‌.. టెన్త్ అర్హతతో 39,481 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు
గుడ్‌న్యూస్‌.. టెన్త్ అర్హతతో 39,481 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు
రూ.100 కోట్ల విరాళం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగులు
రూ.100 కోట్ల విరాళం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగులు
సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత..
సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత..
వినాయక చవితికి కావాల్సిన సామాన్ల లిస్ట్ ఇదే.. గాబరా పడకండి..
వినాయక చవితికి కావాల్సిన సామాన్ల లిస్ట్ ఇదే.. గాబరా పడకండి..
మెట్రో స్టేషన్ల వద్ద బైక్ పార్క్ చేస్తున్నారా.?సరాసరి ఇక అస్సాంకే
మెట్రో స్టేషన్ల వద్ద బైక్ పార్క్ చేస్తున్నారా.?సరాసరి ఇక అస్సాంకే
మరోసారి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌.. ఒకే రాత్రి ఆరు దుకాణాల్లో చోరీ
మరోసారి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌.. ఒకే రాత్రి ఆరు దుకాణాల్లో చోరీ