Vinayaka Chavithi 2024: ఈ వస్తువులు లేని బొజ్జ గణపయ్య పూజ అసంపూర్ణం.. పొరపాటున కూడా వీటిని మరచిపోవద్దు..

దేశ వ్యాప్తంగా వినాయక చవితి సందడి ఓ రేంజ్ లో ఉంది. ఎక్కడ చూసినా మండపాలే కనిపిస్తున్నారు. ఈ మండపాలలో గణపతి విగ్రహాలు కొలువు దీరనున్నాడు. రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 7వ తేదీ శనివారం నుంచి పది రోజుల పాటు పూజలను అందుకోనున్నాడు బొజ్జ గణపయ్య. అనంతరం భక్తుల నడుమ భారీ ఊరేగింపుతో బొజ్జ గణపయ్య తన తల్లి గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. అయితే వినాయక విగ్రహం తెచ్చింది మొదలు.. ప్రతిష్టించి పూజ చేసే విషయంలో ప్రత్యెక శ్రద్ధ వహించాలి. లేదంటే గణపయ్యకు ఆగ్రహం వస్తుంది. కనుక గణపతికి ఇష్టమైన వస్తువులు కొన్ని ఉన్నాయి. అవి లేని పూజ అసంపూర్ణం అని భావిస్తారు. కనుక ఈ రోజు గణపతి పూజలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం..

|

Updated on: Sep 06, 2024 | 3:17 PM

ప్రతి సంవత్సరం భాద్ర మాసంలోని శుక్ల పక్షం చతుర్థి తిథి రోజుని వినాయకుని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7 వ తేదీ శనివారం రోజున వినాయక చవితిని జరుపుకోనున్నారు. వినాయక చవితి రోజున భక్తులు ఇంట్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు. ఆది దైవంగా పూజలను అందుకునే వినాయకుడికి ఇష్టమైన వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటిని గణేష్ పూజ సమయంలో సమర్పిస్తారు. ముఖ్యంగా ఈ ఏడు వస్తువులు లేని పూజ అసంపూర్ణంగా పరిగణిస్తారు. గణపతి బప్పను ప్రసన్నం చేసుకోవడానికి పూజ కోసం నియమాల ప్రకారం ఉపయోగించాల్సిన వస్తువులు ఏమిటంటే

1 / 8
ఉండ్రాళ్ళు: గణేశుడికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టమని చెబుతారు. కనుక గణపతి పూజ సమయంలో తప్పకుండా ఉండ్రాళ్లు ని అది కూడా 21 ఉండ్రాళ్ళను పెట్టె సంప్రదాయం ఉంది. కనుక బొజ్జ గణపయ్యకు ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి. తర్వాత ఈ ప్రసాదాన్ని పిల్లలకు పంచితే మీ బాధలన్నీ తొలగిపోతాయి.

2 / 8
కుడుములు: గణేశుడి నైవేద్యం పెట్టె ఆహార పదార్ధాలలో తప్పనిసరిగా మోదకం అంటే కుడుములు ఉండాలి. పార్వతిదేవి తన బుజ్జి గణపయ్యకు రుచికరమైన కుడుములు తినిపించిందని హిందువులు నమ్ముతారు. అప్పటి నుండి కుడుములు వినాయకుడికి ఇష్టమైన ఆహారంగా పరిగణించబడుతుంది. అందుకే గణేశ పూజలో తప్పనిసరిగా కుడుములు నైవేద్యంగా పెడతారు.

3 / 8
దర్బ గడ్డి: గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి వినాయక చవితి రోజున తప్పని సరిగా దర్భని సమర్పించండి. గణేశ పూజకు దర్భని ఉపయోగించడం వలన వినాయకుడు ఎంతో సంతోషిస్తాడని హిందువులు నమ్ముతారు.

4 / 8
పసుపు: వినాయకుడికి పసుపు చాలా ఇష్టమైన రంగు. అంతేకాకుండా వినాయకుడికి ఇష్టమైన వస్తువులలో పసుపు ఒకటి. గణేష్ పూజా సమయంలో గణపతి బప్పను ప్రసన్నం చేసుకోవడానికి పచ్చి పసుపుతో వినాయకుడిని చేయండి. ప్రధమ పూజ చేసి ఆ పసుపు వినాయకుడిని గదిలో లాకర్లో ఉంచండి. దీంతో గణేష్ పూజ విజయవంతమైంది.

5 / 8
అరటిపండు: పూజ చేసే వస్తువుల్లో అరటి పళ్ళు తప్పని సరిగా ఉండాలి. అయితే ఎప్పుడూ ఒక్క అరటిపండు దేవుడికి నైవేద్యంగా నివేదించకండి. వినాయక చవితి రోజున వినాయకుడికి రెండు కంటే ఎక్కువ అరటిపండ్లు సమర్పించండి. ఎల్లప్పుడూ అరటిపండ్లను జతలుగా కేటాయించండి.

6 / 8
కుంకుమ: గణేశుడికి సిందూరాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అంగారకుడి గుర్తుగా గణపతి పూజలో కుంకుమని సమర్పిస్తారు.

7 / 8

పసుపు పువ్వులు: వినాయక చవితి రోజున గణేశుడికి ఒక్క మొగలి పువ్వు మినహా అన్ని రకాల పూలను సమర్పించవచ్చు. అయితే గణపతి బప్పకు ముఖ్యంగా పసుపు పువ్వులంటే చాలా ఇష్టం. అయితే పొరపాటున కూడా గణపతి పూజలో ఎప్పుడూ తులసి దళాలను సమర్పించవద్దు.

8 / 8
Follow us