Vijayawada: శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి..

ఇంద్రకీలాద్రి మహా శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబైంది. దుర్గా మల్లేశ్వర స్వామికి మంగళస్నానాలు, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా అలంకరణ చేశారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని శాంతి కల్యాణ వేదిక వద్ద ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. తొలుత గణపతి పూజను ఆలయ అర్చకులు నిర్వహించగా, ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, ఈవో కేఎస్ రామారావు దంపతులు హాజరయ్యారు.

Vijayawada: శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి..
Vijayawada Kanakadurga Temp
Follow us
M Sivakumar

| Edited By: Srikar T

Updated on: Mar 07, 2024 | 8:43 PM

ఇంద్రకీలాద్రి మహా శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబైంది. దుర్గా మల్లేశ్వర స్వామికి మంగళస్నానాలు, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా అలంకరణ చేశారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని శాంతి కల్యాణ వేదిక వద్ద ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. తొలుత గణపతి పూజను ఆలయ అర్చకులు నిర్వహించగా, ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, ఈవో కేఎస్ రామారావు దంపతులు హాజరయ్యారు. అనంతరం గంగా పార్వతీ దేవా (దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు పంచామృతాభిషేకాలు, మంగళ స్నానాలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ. ఆలయ ప్రధాన అర్చకులు మల్లేశ్వర శాస్త్రి, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం స్వామి వార్లను పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెగా ముస్తాబు చేశారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం పునఃనిర్మాణం తర్వాత తొలిగా జరుగుతున్న మహా శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. స్వామి వారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు ఆలయ ప్రధాన ద్వారం వద్ద పూలతో అలంకరించింది..

మహా శివరాత్రిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై నిర్వ హిస్తున్న కల్యాణోత్సవంలో భాగంగా అమ్మవారి మూల విరాట్కు పెళ్లికుమార్తెగా అలంకరించారు. నుదిటిన బాసికం, బుగ్గన చుక్కతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 10.30 గంటలకు అమ్మవారిని పెళ్లి కుమార్తెగా అలంకరించారు. ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదిక వద్ద పలు వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. తొలుత విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన, మండపారాధన పూజలు నిర్వహించారు. ఆది దంపతుల కల్యాణోత్సవానికి సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఆలయ అర్చకులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ అర్ధరాత్రి 12.00 గంటలకు కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. మహా శివరాత్రి పుణ్యస్నానాలకు దుర్గాఘాట్ సిద్ధమవుతోంది. భక్తులు నదిలోకి దిగి పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా ఘాట్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నదిలోకి దిగే వారితో పాటు గట్టుపై జల్లు స్నానాలు ఆచరించేలా దేవస్థానం అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. నదీ తీరంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థాన అధికారులు ప్రత్యేకంగా బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తుండగా, వన్ టౌన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటుపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..