AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2025: నవరాత్రి 9 రోజులు 9 వేర్వేరు నైవేద్యాలు.. అమ్మ ఆశీస్సులతో వేర్వేరు ఫలితాలు

దేవీ నవరాత్రుల కోసం అమ్మవారి భక్తులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని నవ దుర్గలుగా పూజిస్తారు. అమ్మవారికి ఇష్టమైన రంగుతో పాటు అమ్మవారికి ఇష్టమైన ఆహరాన్ని తొమ్మిది రోజుల పాటు నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే మొదటిసారి నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తుంటే.. పూజ నియమాలు తెలుసుకోవడం తప్పని సరి. ఈ నేపధ్యంలో నవరాత్రులలోని తొమ్మిది రోజులలో దుర్గాదేవి 9 రూపాలను పూజించడంతో పాటు 9 రోజులు సమర్పించాల్సిన నైవేద్యాలు ఏమిటో తెలుసుకుందాం..

Navaratri 2025: నవరాత్రి 9 రోజులు 9 వేర్వేరు నైవేద్యాలు.. అమ్మ ఆశీస్సులతో వేర్వేరు ఫలితాలు
Shardiya Navratri 2025
Surya Kala
|

Updated on: Sep 16, 2025 | 5:03 PM

Share

ఈ ఏడాది శారదీయ నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమై అక్టోబర్ 1న ముగుస్తాయి. శారదియ నవరాత్రులలో దుర్గాదేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవరాత్రులలోని ఈ తొమ్మిది రోజులలో, భక్తులు దుర్గాదేవి తొమ్మిది విభిన్న రూపాలను పూజిస్తారని నమ్ముతారు. నవరాత్రిలో పూజతో పాటు, నైవేద్యానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దుర్గాదేవికి ఇష్టమైన ఆహారాన్ని సమర్పించడం ద్వారా అమ్మవారు సంతోషించి.. తన భక్తులపై ఆశీస్సులను ఇస్తుందని.. ఆనందం, శ్రేయస్సు, శాంతి, శక్తిని కురిపిస్తుందని నమ్ముతారు. ప్రతి రోజు అమ్మవారి విభిన్న రూపాన్ని పూజిస్తారు. ప్రతి దేవతకి ఇష్టమైన ఆహారం కూడా భిన్నంగా ఉంటుంది. అందుకే నవరాత్రిలో ప్రతి రోజు దుర్గాదేవి రూపం ప్రకారం ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉంది. ఆ తొమ్మిది దివ్య నైవేద్య ఆహారం గురించి తెలుసుకుందాం.

శారదీయ నవరాత్రుల తొమ్మిది రోజులు.. తొమ్మిది వేర్వేరు నైవేద్యాలు

  1. మొదటి రోజు- శైలపుత్రి: ఈ రోజున దుర్గాదేవి మొదటి రూపమైన శైలపుత్రిని పూజిస్తారు. ఈ రోజున ఆవు నెయ్యిని, కట్టెపొంగలిని సమర్పించడం వల్ల భక్తులకు దుర్గామాత ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. ఈ పరిహారం వ్యాధులు , బాధలను తొలగిస్తుందని నమ్ముతారు.
  2. రెండవ రోజు బ్రహ్మచారిణి: ఈ రోజున, దుర్గాదేవికి పులిహోర, మిఠాయిని నైవేద్యం పెట్టే సంప్రదాయం ఉంది. ఇది కుటుంబంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.
  3. మూడవ రోజు చంద్రఘంట: ఈ రోజున దుర్గాదేవిని చంద్రఘంట రూపంలో పూజిస్తారు. ఈ రోజున దేవికి కొబ్బరి అన్నం, బియ్యంతో చేసిన కొబ్బరి పాయసాన్ని సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత, దుఃఖం నుంచి ఉపశమనం లభిస్తుంది.
  4. నాల్గవ రోజు కూష్మాండ మాత: ఈ రోజున దుర్గామాతను కూష్మాండ దేవిగా పుజిస్తారు. అమ్మవారికి ఇష్టమైన మినపగారెలు లేదా మొక్కజొన్నగారెలు లేదా పెసరగారెలు ప్రసాదంగా సమర్పించడం వల్ల జీవితంలోని అన్ని దుఃఖాలు నశిస్తాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. ఐదవ రోజు స్కందమాత మాత: శారదయ నవరాత్రులలో ఐదవ రోజు అమ్మవారిని స్కందమాతగా పుజిస్తారు. అమ్మవారికి దద్దోజనం, లేదా పెరుగన్నం, అరటిపండ్లను సమర్పించాలి. ఇది సానుకూల శక్తిని పెంచుతుంది.
  7. ఆరవ రోజు కాత్యాయనిదేవి: ఈ రోజున కాత్యాయని దేవికి తేనె, కేసరి ని ప్రసాదం సమర్పించాలి. ఇది ఆకర్షణ శక్తిని పెంచుతుంది. సంబంధాలను మధురంగా ​​చేస్తుంది.
  8. ఏడవ రోజు కాళరాత్రి: ఈ రోజున మా కాళరాత్రి అమ్మవారికి బెల్లం లేదా బెల్లంతో చేసిన వస్తువులను , శాకాన్నం లేదా కలగూర పులుసును సమర్పించడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.
  9. ఎనిమిదవ రోజు మహాగౌరిదేవి: నవరాత్రులలో ఎనిమిదవ రోజు దుర్గా దేవి మహాగౌరి రూపాన్ని పూజిస్తారు. ఈ రోజున దేవికి కొబ్బరికాయను, చక్రపొంగలి సమర్పించాలి. ఇది పిల్లలకు సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది.
  10. తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి: తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రికి నువ్వుల ప్రసాదం లేదా పాయసం లేదా పరమాన్నం సమర్పించాలి. ఇది ఆకస్మిక విపత్తుల నుంచి రక్షణను అందిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
మీకు కారు ఉందా.? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే..
మీకు కారు ఉందా.? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే..
ఇండస్ట్రీలో తోప్ హీరో.. సినిమా వస్తే పక్కా హిట్
ఇండస్ట్రీలో తోప్ హీరో.. సినిమా వస్తే పక్కా హిట్
మనీ ప్లాంట్ పెంపకంలో ఈ తప్పులు వద్దు.. లైట్ తీసుకుంటే సమస్యలు..
మనీ ప్లాంట్ పెంపకంలో ఈ తప్పులు వద్దు.. లైట్ తీసుకుంటే సమస్యలు..
ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే.. పాపం.! ఈ ఎస్సై పరిస్థితి చూస్తే
ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే.. పాపం.! ఈ ఎస్సై పరిస్థితి చూస్తే
39 మ్యాచ్‌ల్లో 1109 పరుగులు.. టీమిండియా నయా ఛేజింగ్ మాస్టర్
39 మ్యాచ్‌ల్లో 1109 పరుగులు.. టీమిండియా నయా ఛేజింగ్ మాస్టర్
చేపలతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు ఖాయం..
చేపలతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు ఖాయం..