Viral Video: కూతురి మంచం మీద నల్ల తాచు బుసలు.. వీడియో తీస్తున్న తల్లిదండ్రులు
నాకు పిచ్చి కుదిరింది, తలకు రోకలి చుట్టండి'' అన్న సామెతను గుర్తుచేసేలా ఉంటుంది కొంతమంది ప్రవర్తన. రీల్స్, లైక్స్ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రకరకాల పనులు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. తాజాగా నెట్టింట్లో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక బాలిక మంచం మీద నిద్రపోతుంది. ఆ బాలిక పక్క నుంచి ఒక నల్ల పాము పాకుతూ వెళ్తుంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు వీడియో తీస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పాముని చూస్తే చాలు భయంతో వీలైంత దూరంగా పారిపోతారు. అవి విష పూరిత పాములైనా, విషం లేని పాములైనా సరే భయపడతారు. ఎందుకంటే పాము కరిస్తే ప్రాణాలకు అపాయం కలుగుతుంది. చికిత్స తీసుకోవడంలో ఏ మాత్రం నిర్లక్షం చేసినా మరణించవచ్చు కూడా.. అందుకే మానవులు మాత్రమే కాదు..జంతువులు కూడా ఈ విషపూరిత జీవికి దూరంగా ఉండటం మంచిదని భావిస్తారు. అయితే ఒక బాలిక మంచం మీద నిద్రపోతుంటే.. ఆ పక్కన ప్రమాదకరమైన పాము పాకుతుంటే.. కుటుంబ సభ్యులు పాముని అక్కడ నుంచి తీసే ప్రయత్నం చేయకుండా… ఆ సన్నివేశాన్ని వీడియో రికార్డ్ చేయడం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. దీనిని చూసిన తర్వాత నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది బాలిక తల్లిదండ్రులను తిట్టిపోస్తున్నారు.
ఈ వైరల్ వీడియోలో ఒక అమ్మాయి తన మంచం మీద పడుకుని ఉండటం.. ఒక నల్ల పాము నెమ్మదిగా బాలిక దగ్గరకు పాకడం కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ అమ్మాయి పాము తోకను తన చేతితో పట్టుకుని గుండెల దగ్గర పెట్టుకుంది. బాలిక దైర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియో క్లిప్ చూసిన నెటిజన్ల ఆందోళన సమర్థనీయమే.. అయితే ఈ వీడియో వెనుక ఉన్న అసలు నిజం ఏమిటంటే… సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @snakemasterexotics అనే ఖాతాలో షేర్ చేశారు. ఈ ఖాతా ప్రొఫైల్‌లో ఈ పాము ఆ బాలిక ఫ్యామిలీ పెంపుడు జంతువు అని .. ఈ అమ్మాయి భారీ సంఖ్యలో పాములను సేకరించి పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇది మాత్రమే కాదు ఆమె కుటుంబ సభ్యులు సరీసృపాలను పెంచుతారు. మ్యూజియంను నిర్వహిస్తున్నారు. ఆ అమ్మాయి పాములకు భయపడకపోవడానికి ఇదే కారణం.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
సెప్టెంబర్ 6న షేర్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటివరకు 5.5 లక్షలకు పైగా వీక్షించారు. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది దీనిని అమ్మాయి తల్లిదండ్రుల నిర్లక్ష్యం అని అంటున్నారు. ఒక యూజర్ ఏ తల్లిదండ్రులు అయినా తమ పిల్లల్ని ఇలా చేయడానికి ఎలా అనుమతిస్తారని కామెంట్ చేశారు. మరొకరు ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట అని అన్నారు. వీక్షణల కోసం మీ పిల్లల ప్రాణాలను పణంగా పెట్టడం సరైనది కాదన్నారు. మరొక యూజర్ పాములు కాటు వేసే స్వభావం కలిగి ఉంటాయి. అవి ఎప్పుడైనా అమ్మాయికి హాని కలిగించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




